Bigg Boss Telugu 5: బ్రేకప్‌, ఆత్మహత్య చేసుకుందామనుకున్నా, డోర్‌ తీయలేదు.. షణ్ముఖ్‌

22 Oct, 2021 23:59 IST|Sakshi

Bigg Boss Telugu, Episode 48: బిగ్‌బాస్‌ హౌస్‌లోని ఇంటిసభ్యులందరూ వారు జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకుల గురించి చెప్పాలంటూ ఓ టాస్క్‌ ఇచ్చారు. మొదటగా సన్నీ మాట్లాడుతూ.. 'అమ్మ పేరు కళావతి. ఒక మహిళ ముగ్గురు అబ్బాయిలను పెంచడం అనేది ఎంత చాలెంజింగో నాకు బాగా తెలుసు. మా డైరెక్టర్‌ పేరు కృష్ణ. నేను ఒక ప్రాజెక్ట్‌ చేస్తున్నప్పుడు చాలామంది నన్నెన్నో మాటలు అన్నారు. అవి విన్నాక నా వల్ల కాదు, వేరేవాళ్లను చూసుకోమని డైరెక్టర్‌ గారికి చెప్పాను. కానీ ఆయన.. వాళ్లే నీ ఆశీర్వాదం, వాళ్లందరూ నిన్ను పొగిడేలా చూసుకో అని ధైర్యం నూరిపోశాడు. అలా నా ప్రయాణం మొదలై ఇక్కడిదాకా వచ్చాను' అని చెప్పుకొచ్చాడు.

తర్వాత షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. 'ఇంటర్‌ సెకండియర్‌ తర్వాత బెంగళూరులో సీటు వచ్చింది. అదే సమయంలో లవ్‌ బ్రేకప్‌ కావడంతో నా సగం జీవితం పోయిందని చాలా ఫీలయ్యా. సూసైడ్‌ చేసుకుందామనుకున్నా, సరిగ్గా అదే సమయంలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ వచ్చి డోర్‌ కొట్టాడు. కానీ నేను తీయలేదు. తర్వాత అతడు నేరుగా లోపలకు వచ్చి నాలుగు పీకాడు. వాడివల్లే నేను బతికున్నాను. వైవా అనే షార్ట్‌ ఫిలిం ద్వారా నాకు బ్రేక్‌ వచ్చింది. నా ఫేస్‌లో స్మైల్‌ తెప్పించిన పేరెంట్స్‌, కజిన్స్‌కు రుణపడి ఉంటా' అని పేర్కొన్నాడు.

జెస్సీ మాట్లాడుతూ.. 'నాన్న చనిపోయాక చదువుతూ పార్ట్‌ టైం జాబ్‌ చేశాను. ఒకసారి లైవ్‌లో ఫ్యాషన్‌ షో చూశా, ఇదే నాకు సరైనది అనిపించింది. కానీ అక్కడున్న సీనియర్‌ మోడల్స్‌ నన్ను ఎగతాళి చేశారు. నిజానికి నాకు గొంతు సరిగా లేదు. పుట్టుకతోనే దేవుడు నాకా లోపాన్నిచ్చాడు. కానీ నేను దాన్ని దాటుకుని ముందుకు వెళ్లి వారిని ఓడించి టైటిల్‌ కూడా విన్‌ అయ్యాను. గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కాను. కానీ ఎప్పుడూ మా అమ్మ నేను మోడల్‌ అని బయటకు చెప్పుకోలేదు. ఎప్పుడైతే బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిందో అప్పుడు అందరి ఇంటి తలుపులు కొట్టి మరీ నేను మోడల్‌ అంటూ చాటింపు చేసింది' అని ఉద్వేగానికి లోనయ్యాడు.

సిరి తన జ‍్క్షాపకాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయింది. 'నేను వేరేవాళ్లను పెళ్లి చేసుకోబోగా అది ఆగిపోయింది, ఆ తర్వాత నేను ప్రేమించినవాడు చనిపోయాడు. అప్పుడు అందరూ అన్నారు తల్లేమైనా పద్ధతిగా ఉందా? కూతురు ఉండటానికి! అన్నారు. అప్పుడే డిసైడ్‌ అయ్యాను. నేనేంటో చూపిస్తానని! ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్‌ వచ్చి కెరియర్‌ ప్రారంభించాను' అని పేర్కొంది. మొత్తానికి 'స్మైల్‌ చేయండి, టాస్క్‌ చేయండి' అన్న ఈ టాస్క్‌లో జెస్సీ గెలుపొందాడు. అతడు ఈ ఆనందకర క్షణాలను షణ్ముఖ్‌, సిరితో సెలబ్రేట్‌ చేసుకున్నాడు జెస్సీ.

అనంతరం తిననంటూ మారాం చేసిన సిరికి గోరుముద్దలు తినిపించాడు షణ్ను. తర్వాత సన్నీని చూసి సడన్‌గా నవ్వేసింది ప్రియ. తన ప్లేటేంటి? నా టీ కప్పు ఇచ్చినా కడిగేసాడంటూ పడీపడీ నవ్వింది.  తర్వాత బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ఎవరు ఎక్కువ సేపు బెలూన్లు ఉంచుకోగలిగితే వారే గెలిచినట్లు! ఇందులో మొదటి బజర్‌లో జెస్సీ సూది గెలుపొందగా కాజల్‌.. ఇప్పటికే రెండుసార్లు కెప్టెన్‌ అయ్యావంటూ విశ్వను పోటీ నుంచి తప్పించాలనుకుంది. ఆమె చెప్పిన కారణం విన్న విశ్వ అక్కడి నుంచి ఆవేశంతో వెళ్తుండగా అతడి బెలూన్‌ పగిలిపోయింది. రెండో బజర్‌ నొక్కేందుకు విశ్వ పరిగెత్తే క్రమంలో అతడు పింకీని తోసేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పింకీ తనకు కూడా అడ్డం వస్తే తంతానని వార్నింగ్‌ ఇచ్చింది. ఇక విశ్వ.. తన సూదిని రవికి ఇవ్వగా అతడు దాని సాయంతో మానస్‌ బెలూన్‌ పగలగొట్టాడు.

కెప్టెన్‌ అవుతానంటూ ఆశపడ్డ కాజల్‌కు సంపాదించు, కానీ అడుక్కోకు అని సలహా ఇచ్చాడు రవి. మరోవైపు లోబో సంపాదించిన సూదిని రవికివ్వగా అతడు దాంతో కాజల్‌ బెలూన్‌ పగలగొట్టి ఆమె ఆశను అడియాశలు చేశాడు. గేమ్‌ను మలుపు తిప్పే చివరి బజర్‌లో మాత్రం యానీ మాస్టర్‌ పిన్‌ సంపాదించగా దాన్ని తీసుకెళ్లి నేరుగా సన్నీ చేతిలో పెట్టింది. దీంతో ఎమోషనల్‌ అయిన సన్నీ రవిని ఓడించి కెప్టెన్‌ అయ్యాడు. తనను గెలిపించిన యానీని ముద్దుల్లో ముంచెత్తాడు. సెన్సార్‌ బోర్డు యాక్సెప్ట్‌ చేయదని ఇంగ్లీష్‌ కిస్‌ పెట్టలేదని కామెంట్‌ చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించిన సన్నీ కెప్టెన్‌ డ్రెస్‌ వేసుకుని ఇల్లంతా తిరిగాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు