Siri-Shrihan: సిరి.. ఒకరిని ప్రేమిస్తున్నా, ప్రపోజ్‌ చేస్తూ మెసేజ్‌ పెట్టాను.. శ్రీహాన్‌

27 Nov, 2021 23:31 IST|Sakshi

సిరితో ఉంటున్నందుకు షణ్నుకు థ్యాంక్స్‌ చెప్పిన శ్రీహాన్‌

Bigg Boss Telugu 5, Shrihan Saves Siri From Elimination: ఫ్యామిలీ మెంబర్స్‌ను ఇంట్లోకి పంపించి హౌస్‌మేట్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన బిగ్‌బాస్‌ నేడు కూడా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. కంటెస్టెంట్లకు బాగా కావాల్సిన వ్యక్తులను, కుటుంబీకులను స్టేజీపైకి పిలిచాడు. దీంతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఎప్పుడూ హౌస్‌మేట్స్‌తో గేమ్‌ ఆడించే బిగ్‌బాస్‌ ఈసారి వెరైటీగా వారికోసం వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్‌తో గేమ్‌ ఆడించాడు. ఎవరు టాప్‌ 5లో ఉంటారో ఊహించమన్నాడు. అయితే వీరితో మాట్లాడాలంటే బాగా ఇష్టమైన వస్తువు త్యాగం చేయాలని మెలిక పెట్టాడు.

ఈ క్రమంలో సిరి.. తనకు కాబోయే భర్త శ్రీహాన్‌ కానుకగా ఇచ్చిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేసింది. దీంతో నాగ్‌ ఏకంగా శ్రీహాన్‌ను స్టేజీమీదకు పిలిచాడు. చాన్నాళ్ల తర్వాత ప్రియుడు వస్తుండటంతో సిరి బోరుమని ఏడ్చేసింది. కనీసం తలెత్తి అతడిని చూడలేకపోయింది. దీంతో శ్రీహాన్‌.. నన్ను వదిలేస్తున్నవా? అని సూటిగా ప్రశ్నించగా ఆమె ఏదో తప్పు చేసినదానిలా గుంజీలు తీసింది. అది చూసి తట్టుకోలేకపోయిన ఆమె ప్రియుడు.. దేని గురించి ఎక్కువగా ఆలోచించకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అంటూ సిరి ముఖంలో చిరునవ్వు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే బాత్రూంలో తల బాదుకుని ఎందుకు గోడలు పగలగొడుతున్నావని సరదాగా ఏడిపించాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. శ్రీహాన్‌ షార్ట్‌ఫిలిం రిలీజైనప్పుడు తాను గెస్ట్‌గా వెళ్లానని, అక్కడ తన ప్రేమకథకు పునాది పడిందని చెప్పుకొచ్చింది.

ఇప్పుడున్న ఎనిమిది మంది కంటెస్టెంట్లలో ఎవరు టాప్‌ 5లో ఉంటారో చెప్పాలన్నాడు నాగ్‌. కాకపోతే సిరి ఫొటో మాత్రం బోర్డుపై మొదట పెట్టడానికి వీల్లేదన్నాడు. దీంతో మరో ఆప్షన్‌ లేకపోవడంతో అతడు సన్నీని టాప్‌ 1లో పెట్టి షణ్నును రెండో స్థానంలో ఉంచాడు. సిరి పక్కన తాను లేకపోయినా ఆమెకు తోడుగా ఉంటూ రక్షిస్తున్నందుకు షణ్నుకు థ్యాంక్స్‌ చెప్పాడు. తర్వాత యాంకర్‌ రవిని మూడో స్థానంలో, శ్రీరామ్‌ను నాల్గో పొజిషన్‌లో ఉంచాడు. తర్వాత అతడో సీక్రెట్‌ విషయాన్ని పంచుకున్నాడు. నేనొకర్ని ప్రేమిస్తున్నాను, రెండు రోజుల క్రితమే ప్రపోజ్‌ చేశాను. మెసేజ్‌ కూడా పెట్టానంటూ సిరి గుండెల్లో గుబులు రేపాడు. అటు నుంచి థ్యాంక్స్‌ యూ శ్రీహాన్‌ మామా అని రవి కూతురు వియా రిప్లై ఇచ్చిందని చెప్పడంతో అక్కడున్న అంతా నవ్వేశారు. సిరిని అతి చేయకంటూ ఐదో స్థానంలో ఉంచుతూ ఆమె కోసం పాటందుకున్నాడు. చివరగా మీలో మీరు కొట్టుకు చావండి కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండని చెప్తూ సిరిని సేఫ్‌ చేసి వెళ్లాడు.

మరిన్ని వార్తలు