బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో చలాకీ పిల్లగా పేరు తెచ్చుకుంది సిరి హన్మంత్. హౌస్‌లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే యమ యాక్టివ్‌గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించిందీ భామ. హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా అవతరించడంతోపాటు అన్ని టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ క్రేజ్ సంపాదించుకుంది.
ఇదిలావుంటే ఈ యూట్యూబ్ స్టార్‌కు నటుడు శ్రీహాన్‌తో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. కానీ ఇంతలోనే బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో ప్రియుడిని ఒంటరిగా వదిలేసి షోలో ఎంట్రీ ఇచ్చింది. అయితే వీరిద్దరికీ ఓ కొడుకు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉంది. ఈ జోడీ ఓ అబ్బాయిని దత్తత తీసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ చైతూని అడాప్ట్ చేసుకుంటున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా అందుకు సిరి హన్మంత్ అవునని సమాధానమిచ్చింది. వారి నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. బాలనటుడిని దత్తత తీసుకుని అతడికి మంచి భవిష్యత్తును అందిస్తున్నందుకు సిరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.