Bigg Boss 5 Telugu: శ్రీరామ్‌కు బెడిసికొట్టిన పింకీ వైద్యం, దీంతో నడవలేని స్థితికి!

2 Dec, 2021 00:23 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 87: బిగ్‌బాస్‌ షోలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టికెట్‌ టు ఫినాలే' టాస్క్‌ మొదటి లెవల్‌లో ఐస్‌ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో ఉన్న బంతులు కాపాడుకుంటూనే పక్కవారి బకెట్‌లోని బాల్స్‌ను లేపేయాలి. ఈ గేమ్‌లో సన్నీ, సిరి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. నన్ను కావాలనే టార్గెట్‌ చేసి బ్యాడ్‌ చేస్తోందంటూ సిరిపై చిర్రుబుర్రులాడాడు సన్నీ. అతడు తన బాల్స్‌ తీయడానికి కాచుకుని కూర్చుండటంతో ఐస్‌ వాటర్‌లో నుంచి అడుగు బయట పెట్టలేదు సిరి. ఈ క్రమంలో రవి.. ఐ మిస్‌ యూ అంటూ సిరి ఏడ్చేయగా, నీకోసం ఆడుతున్నా రవి అంటూ షణ్ముఖ్‌ గొంతెత్తి అరిచాడు. ఈ చర్యతో మిగతా వాళ్లు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

సన్నీ తనను టార్గెట్‌ చేయడంతో ఐస్‌ బకెట్‌లో నుంచి కాళ్లు తీయకుండా అలాగే నిల్చుండిపోయిన సిరికి కాళ్లు పట్టేసుకున్నాయి. దీంతో గేమ్‌ ముగియగానే మానస్‌ ఆమెకు సాయం అందించాడు. మరోపక్క బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు మెడికల్‌ రూమ్‌లోకి వైద్యం అందించారు. సిరి నడవలేని స్థితిలో ఉండటంతో మానస్‌ ఆమెను ఎత్తుకుని తీసుకురావడాన్ని షణ్ను తట్టుకోలేకపోయాడు. వాళ్ల సాయం ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు. ఇలాగైతే నాకు ఫ్రెండ్‌గా ఉండకంటూ ఆవేశంతో ఊగిపోగా సిరి ఏడ్చేసింది.

ఐస్‌ వాటర్‌ నుంచి బయటకు రాగానే వేడినీళ్లు పోయడం హానికరమని వార్నింగ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అదేమీ పట్టించుకోని ప్రియాంక... కాళ్లు తిమ్మిరెక్లిన శ్రీరామ్‌కు అర్ధరాత్రి జండూ భామ్‌ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్‌ చేసింది. దీంతో అతడికి వాపు తగ్గడం కాదు కదా నొప్పి మరింత ఎక్కువైంది. దీంతో వెంటనే శ్రీరామ్‌ను మెడికల్‌ రూమ్‌లోకి పిలిచి మందులు రాసిచ్చారు. ఐస్‌ వాటర్‌లో నుంచి బయటకు వచ్చాక కాళ్లపై వేడినీళ్లు పోయడం హానికరమని చెప్పినప్పటికీ పింకీ శ్రీరామ్‌కు అలా చేసిందేంటని మానస్‌, కాజల్‌ అసహనానికి లోనయ్యారు. అయితే ఇలా జరుగుతుందని ఊహించలేదని పింకీ శ్రీరామ్‌కు క్షమాపణలు చెప్పింది. కానీ ఆమె చేసిన తప్పు వల్ల శ్రీరామ్‌ బెడ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

ఒక అడుగు కూడా వేయలేకపోతున్న కంటెస్టెంట్ల బాధలు చూసి సన్నీ ఏడ్చేశాడు. తర్వాతి రోజు శ్రీరామ్‌ పాడిన 'గెలుపు తలుపులే తీసే ఆకాశమే..' సాంగ్‌ ప్లే చేయడంతో అతడు మనసారా ఏడ్చాడు. ఫైనల్‌గా తొలి రౌండ్‌లో సన్నీ ఆధిక్యంలో ఉండగా ప్రియాంక సింగ్‌ చిట్టచివరి స్థానంలో నిలిచింది. తర్వాత ఫోకస్‌ అనే రెండో లెవల్‌లో బజర్‌ మోగినప్పుడు 29 నిమిషాలు లెక్కించి గంట కొట్టాలి. ఎవరైతే సరిగ్గా, లేదా 29 నిమిషాలకు దగ్గరలో ఉన్నప్పుడు బెల్‌ మోగిస్తారో వారు గెలిచినట్లు లెక్క! ఈ గేమ్‌లో సన్నీకి మానస్‌ సాయం కోరగా అతడు అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దీంతో సన్నీ మానస్‌ లెక్కపెడుతున్నాడని తాపీగా కూర్చోవడమే కాదు, పదేపదే అతడి వంకే చూడసాగాడు. దీంతో అక్కడున్న మిగతా హౌస్‌మేట్స్‌కు వీరి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అర్థమైపోయింది. చివరకు సన్నీ మానస్‌ సైగ చేసిన వెంటనే గంట కొట్టాడు.

ఆ తర్వాత సన్నీ జోకర్‌లా రెడీ అయి శ్రీరామ్‌ను నవ్వించాడు. అతడు నడవలేని స్థితిలో ఉండటంతో బెడ్‌పైనే ఉండి గేమ్‌ ఆడగా మిగతా అందరు మాత్రం గార్డెన్‌ ఏరియాలో ఉండి ఆడారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారమైతే ఈ రౌండ్‌లో ప్రియాంక, శ్రీరామ్‌, సిరి, షణ్ను, మానస్‌ ఆధిక్యంలో ఉన్నారట! అంటే సాయం తీసుకుని కూడా సన్నీ ఓడిపోయి అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు