సిరికి ట్రై చేసేవాడిని, హమీదాతో డేటింగ్‌..: శ్రీరామచంద్ర

1 Oct, 2021 19:33 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోను రక్తి కట్టించేది కొట్లాటలు, టాస్క్‌లు మాత్రమే కాదు, లవ్‌ ట్రాకులు కూడా! హౌస్‌లో ప్రేమాయణం నడిపే కంటెస్టెంట్లు షో ముగిశాక మాత్రం అబ్బే, మా మధ్య అలాంటిదేమీ లేదంటారు. కేవలం ఫ్రెండ్‌షిప్‌ అని పుకార్లకు చెక్‌ పెడుతుంటారు. ఇది ప్రతి సీజన్‌కు సర్వసాధారణమైపోయింది. ఈ సారి బిగ్‌బాస్‌ షోలో లవ్‌ ట్రాకులు అనగానే మొదటగా గుర్తొచ్చే జంట శ్రీరామ్‌- హమీదా. వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడమే కాక హమీదాకు మసాజ్‌లు కూడా చేశాడు శ్రీరామ్‌. తమ మధ్య ఉన్నది రిలేషన్‌కు ఏ పేరు పెట్టాలో అర్థం కాక సతమతమయ్యారిద్దరూ! కానీ ప్రేక్షకులు మాత్రం వీళ్లను క్యూట్‌ కపుల్‌గా పేర్కొంటున్నారు.

అయితే శ్రీరామ్‌ తాజా ప్రోమోలో చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. మీ మనసులో ఎవరైనా ఉన్నారా? అని ప్రియ ప్రశ్నించగా.. 'సిరి కమిటెడ్‌ కాకపోయుంటే తప్పకుండా ఆమెకు ట్రై చేసేవాడిని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పా'నని మనసులోని మాటను బయటపెట్టాడు శ్రీరామ్‌. ఒక అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్తావని ప్రశ్నించగా అతడు హమీదాను సూటిగా చూడటంతో ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. తర్వాత వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇక సన్నీ తన యాంకరింగ్‌, ఇమిటేషన్‌తో మిగతా కంటెస్టెంట్లను కడుపుబ్బా నవ్వించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు