VJ Sunny: సన్నీ ఛాలెంజ్‌ను ఆ కంటెస్టెంట్లు స్వీకరిస్తారా?

23 Dec, 2021 17:53 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేత వీజే సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్‌ శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు. బిగ్‌బాస్‌ అయిపోయింది ఇంక నామినేషన్స్‌ ఏంటి అనే కదా మీ డౌటు.. ఈ ఛాలెంజ్‌ బిగ్‌బాస్‌కి సంబంధించింది కాదు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌  ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు షణ్ముక్‌, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్‌ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. 


 

మరిన్ని వార్తలు