Bigg Boss 6 Telugu: గీతూకే అంతుంటే నాకెంతుండాలి: చలాకీ చంటి

10 Oct, 2022 15:48 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా చలాకీ చంటి ఎలిమినేట్‌ కావడంతో ఈ సంఖ్య ఐదుకి చేరింది. షో నుంచి బయటకు వచ్చేసిన చంటికి బిగ్‌బాస్‌ బజ్‌ యాంకర్‌ శివ సూదుల్లాంటి ప్రశ్నలు వేశాడు. హౌస్‌లో పంచులు వేయలేదని, జనాలు చలాకీ చంటి ఏమైపోయాడని అనుకుంటున్నారని విమర్శించాడు. జనాలు ఫ్లాప్‌ అనుకోవడం వల్లే తాను హౌస్‌ బయటున్నానని చంటి అంగీకరించాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో గేమ్‌ ఆడటం అంటే ఫేక్‌గా ఉండటమేనని, నువ్వు కూడా ఫేక్‌గా ఆడుతున్నావంటూ శివపై సెటైర్లు వేశాడు చంటి. నాలుగు వీడియో చేస్తూ రివ్యూలు ఇచ్చే గీతూకే అంతుంటే నాకెంతుండాలి అని సగంలోనే ఆపేశారు. ఇంకా చాలా చెప్పాలనుకున్నా.. కానీ సూటిగా చెప్తే తట్టుకునే శక్తి ఎవ్వడికీ ఉండదన్నాడు చంటి. మరి చంటి ఏం మాట్లాడాలో తెలియాలంటే బిగ్‌బాస్‌ కెఫె ఎపిసోడ్‌ మొత్తం చూసేయండి..

చదవండి: చంటి అవుట్‌, నేనే వెళ్లిపోతానంటూ ఏడుపందుకున్న ఇనయ
నాగచైతన్య సినిమా యూనిట్‌పై గ్రామస్తుల దాడి

మరిన్ని వార్తలు