Bigg Boss 6 Telugu: మూడుసార్లు కోమాలోకి... డాక్టర్లు చేతులెత్తేశారు

6 Oct, 2022 17:55 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఎవరు గేమ్‌ బాగా ఆడుతున్నారు? అంటే అందులో గీతూ రాయల్‌ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. హౌస్‌లో ఆమె గొంతు వినిపించడమే కాదు, ప్రేక్షకులకు ఆమె ఆట కూడా కనిపిస్తుంది. వరుసగా నామినేట్‌ అవుతూ వస్తున్న గీతూ ఈ వారం కాస్త బ్రేక్‌ తీసుకుని బిగ్‌బాస్‌ హౌస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తోంది. సీతయ్య ఎవ్వడి మాటా వినడు అనే టైప్‌లో పక్కవాళ్లు చెప్పింది కాకుండా తన మనసుకు నచ్చింది చేసుకుంటూ పోతోంది. అటు టాస్క్‌లు ఆడుతూ, ఇటు ఎంటర్‌టైన్‌ చేస్తూ తగ్గేదేలే అంటోంది. ముక్కుసూటిగా మాట్లాడే గీతూ రియల్‌ లైఫ్‌లో మూడుసార్లు చావు అంచుల వరకు వెళ్లొచ్చిందట. ఈ విషయాన్ని తాజాగా ఆమె తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

గీతూ పేరెంట్స్‌ మాట్లాడుతూ.. 'మా కుటుంబానికి ఆగస్టు గండం ఉంది. ఆగస్టు వస్తుందంటేనే భయపడిపోతాం. ఆ నెలలో ఏదో ఒక ఇబ్బందులు వస్తుంటాయి. గీతూ ఒకసారి బస్సు దిగేటప్పుడు కిందపడి తలకు బాగా దెబ్బ తగిలి కోమాలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కానీ బతికి బట్టకట్టింది. అలా చిన్నప్పుడు ఓసారి, పదో తరగతిలో ఓసారి, డిగ్రీలో ఓసారి కోమాలోకి వెళ్లి వచ్చింది. కర్నూలు, చెన్నై, బెంగళూరులో మూడుసార్లు ఆమె కోమాలోకి వెళ్లి బయటపడింది. నిజానికి ఆమెను బతికించలేమని వైద్యులు చేతులెత్తేశారు, కానీ భగవంతుడి దయ వల్ల ఆమె తిరిగి ఊపిరి తీసుకుంది. అయితే మూడుసార్లు కోమాలోకి వెళ్లడం వల్ల కొన్నిసార్లు తను చిన్నచిన్న విషయాలు మర్చిపోతుంటుంది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్కులు ఆడే సమయంలో ఆమె తలకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనన్న భయం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది' అని చెప్పుకొచ్చారు.

చదవండి: ఒక్క దెబ్బతో పడిపోయిన ఇనయా గ్రాఫ్‌

మరిన్ని వార్తలు