Bigg Boss 6 Telugu: బాలాదిత్య కంటతడి.. గీతూను ఎలిమినేట్‌ చేయాల్సిందేనంటున్న నెటిజన్లు

2 Nov, 2022 16:30 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోను బుల్లితెర హిట్‌ షోగా పిలుచుకుంటారు. ఈ షో వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే దాదాపు ప్రతి సీజన్‌లో కంటెస్టెంట్లు గొడవలు పడి గేమ్‌ తర్వాత కలిసిపోతుంటారు. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా అది గేమ్‌, నామినేషన్స్‌ వరకు మాత్రమే! కానీ ఈసారి ఏంటో గేమ్‌ కన్నా కూడా గొడవలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ఈ సీజన్‌లో ఒకరినొకరు టార్గెట్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది.

మొన్నటివరకు అన్న అంటూ బాలాదిత్యతో బంధం కలుపుకున్న గీతూ ఆయన్నే టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న చేపల చెరువు టాస్క్‌లో కావాలని బాలాదిత్య టీమ్‌ను గేమ్‌ నుంచి సైడ్‌ చేసింది. ఇప్పుడేమో అతడి బలహీనత అయిన సిగరెట్లను దాచి కక్ష సాధిస్తోంది. మిషన్‌ పాజిబుల్‌ అనే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో భుజబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్‌. ఇంకే, ఆ ఒక్క పాయింట్‌ను పట్టుకుని సిగరెట్లు, లైటర్‌ దాచేసింది గీతూ. గేమ్‌ అయిపోయినా, తనకు సిగరెట్లు కావాలని అతడు ఏడుస్తున్నా కూడా ఆమె మనసు కరగడం లేదు.

మరోవైపు ఇనయ వల్లే సూర్య ఎలిమినేట్‌ అయ్యాడని నామినేషన్‌లో అరిచి మరీ చెప్పారు శ్రీహాన్‌, శ్రీసత్య. కానీ గేమ్‌లో కూడా పదే పదే అదే పాయింట్‌ లేవనెత్తి ఆమెను వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేయడం అవసరమా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అందరికంటే గీతక్క ఎక్కువ రోత పుట్టిస్తుందని, ముందుగా ఆమెను ఎలిమినేట్‌ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలాదిత్యను ఇలాగే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తే గీతూ ఈ వారమే బయటకు వెళ్లడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్‌లో రేవంత్‌, బాలాదిత్య టాప్‌లో ఉండగా గీతూ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: నిందలు తట్టుకోలేక బాత్రూమ్‌లోకి ఇనయ
క్యాసినో కింగ్‌ చీకోటితో ఆర్జీవీ

మరిన్ని వార్తలు