Bigg Boss Telugu 6: శ్రీసత్యకు భయపడ్డ అర్జున్‌, బలైపోయిన వాసంతి

21 Oct, 2022 23:29 IST|Sakshi

Bigg Boss Telugu 6, Episode 48: బిగ్‌బాస్‌ హౌస్‌లో బ్యాటిల్‌ ఫర్‌ సర్వైవర్‌ టాస్క్‌ ఈరోజు కూడా కొనసాగింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీసత్య(బ్లూ) టీమ్‌పై ఇనయ(రెడ్‌) టీమ్‌ పైచేయి సాధించింది. తర్వాత బిగ్‌బాస్‌ బ్లూ టీమ్‌ వదిలేసిన గ్లవ్స్‌ పంపించాడు. ఆ గ్లవ్స్‌ సాయంతో గెలిచిన టీమ్‌లో నుంచి ఒకరితో స్వాప్‌ చేసుకునే ఛాన్స్‌ ఉందన్నాడు. భలే ఛాన్స్‌ దొరికిందనుకున్న శ్రీసత్య వెంటనే స్వాప్‌ చేసుకోవచ్చా అని అడిగింది. అయితే టాస్క్‌లో ఆ గ్లవ్స్‌ను లెక్కించకుండా వదిలేసినందున బ్లూ టీమ్‌ ఆ ఆఫర్‌ కోల్పోయిందని చెప్పాడు. దీంతో ముఖం వేలాడేసుకుని ఆ గ్లవ్స్‌ను లోపల పెట్టేసింది శ్రీసత్య.

ఇక ఓడిన టీమ్‌లో నుంచి ఒకరు నామినేట్‌ అవ్వాలని బిగ్‌బాస్‌ ముందే చెప్పాడు. ఈ క్రమంలో రాత్రిపూట బ్లూ టీమ్‌ మీటింగ్‌ పెట్టింది. టాస్కులో టీమ్‌ సభ్యులమందరం వంద శాతం ఇచ్చాం కాబట్టి చీటీలు వేసుకుందామంది  శ్రీసత్య. చీటీలో ఎవరు పేరు వస్తే వారు నామినేషన్‌లోకి వెళ్లాలంది. ఆ చీటీలో తన పేరే రావడంతో నామినేషన్‌కు సై అంది శ్రీసత్య. కానీ తెల్లారేసరికి మళ్లీ మాట మార్చింది. అందరం చర్చించుకుని ఎక్కువ ఓట్లు వచ్చినవారిని నామినేషన్‌లోకి పంపిద్దామంది.

ఈ క్రమంలో శ్రీసత్య.. అర్జున్‌ ఒకరి పేర్లు మరొకరు చెప్పుకున్నారు. కానీ శ్రీసత్య నొచ్చుకోవడంతో అర్జున్‌.. తన ఓటు వెనక్కు తీసుకుని దాన్ని మెరీనాకు వేశాడు. మెరీనా, వాసంతి.. గీతూకు ఓటేశారు. రాజ్‌.. వాసంతి పేరెత్తడంతో ఆమె శివాలెత్తింది. ఎంత ఆడినా కూడా ఆడలేదని నామినేట్‌ చేస్తే ఎంత బాధేస్తుందని కంటతడి పెట్టుకుంది. మెజారిటీ టీమ్‌ మేట్స్‌ వాసంతినే టార్గెట్‌ చేయడంతో ఆమె నెక్స్ట్‌ వీక్‌ నేరుగా నామినేట్‌ అయింది.

అనంతరం సరిగా ఆడనివారికి డిజాస్టర్‌ బ్యాచ్‌లు పెట్టమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. మొదటగా అర్జున్‌ మాట్లాడుతూ.. గేమ్‌లో లైన్‌ క్రాస్‌ చేసి తిట్టావంటూ రేవంత్‌కు డిజాస్టర్‌ బ్యాచ్‌ తగిలించాడు. వాసంతి.. నాకంటే తక్కువ గేమ్‌ ఆడావంటూ గీతూకు బ్యాడ్జ్‌ పెట్టింది. బిగ్‌బాస్‌ రూల్స్‌ పాటించట్లేదంటూ రేవంత్‌కు బ్యాడ్జ్‌ పెట్టింది శ్రీసత్య. రేవంత్‌ను కావాలని కొట్టడం తప్పని వాసంతి డిజాస్టర్‌ అన్నాడు సూర్య.

మెరీనా.. గీతూను, గీతూ, రేవంత్‌, ఆదిరెడ్డి.. వాసంతిని, రాజ్‌, శ్రీహాన్‌, ఫైమా.. మెరీనాను, ఇనయ.. సూర్యను డిజాస్టర్‌గా పేర్కొన్నారు. మెజారిటీ ఇంటిసభ్యులు వాసంతిని డిజాస్టర్‌గా ఎన్నుకోవడంతో బిగ్‌బాస్‌ ఆమెను జైలుకు పంపించాడు. గీతూ అందరినీ మానిప్యులేట్‌ చేసి తనను నామినేషన్‌లోకి పంపిందని అభిప్రాయపడింది వాసంతి. తర్వాత జరిగిన నెయిల్‌ పాలిష్‌ ఛాలెంజ్‌లో సూర్య, వసంతి జంట గెలుపొందింది.

చదవండి: ప్రిన్స్‌ రివ్యూ, జాతిరత్నాలు డైరెక్టర్‌ నవ్వించాడా?
కార్తికేయ 2తో డైరెక్టర్‌ సాహసం చేశాడు: పరుచూరి

మరిన్ని వార్తలు