Bigg Boss 6 Telugu: సూర్య ఎలిమినేట్‌, కన్నీరుమున్నీరుగా విలపించిన ఇనయ

29 Oct, 2022 22:56 IST|Sakshi

Bigg Boss 6 Telugu, Episode 56: నాగార్జున వచ్చీరాగానే తన కోపాన్నంతా కక్కేశాడు. చేపల చెరువు టాస్క్‌లో గీతూ ఎలా ఆడిందో ఆదిని రివ్యూ ఇవ్వమన్నాడు. గీతూ ఫిజికల్‌గా బాగా ఆడిందని వెనకేసుకొచ్చాడు ఆది. మరి అంత బాగా ఆడితే మీ దగ్గరే ఎందుకు తక్కువ చేపలున్నాయన్నాడు. దీంతో వాళ్లు మౌనంగా ఉండిపోయారు. గీతూ మధ్యలో ఏదో చెప్పేందుకు ప్రయత్నించగా పానకంలో పుడకలా మధ్యలో మాట్లాడకని వార్నింగ్‌ ఇచ్చాడు నాగ్‌. సంచాలక్‌గా తన ఆటతీరు ఎలా ఉంది? అని ప్రశ్నించగా మెజారిటీ హౌస్‌మేట్స్‌ ఆమె అలా ఆట మధ్యలో దూరడం తప్పని చెప్పారు.

అయితే గీతూ మాత్రం.. నేనుండే సీజన్‌లో ఎవరు ఆడకపోయినా నేనే ఆడిస్తానని రెచ్చగొట్టాను. బయట కూడా నేను గేమర్‌ను అని చెప్పుకొచ్చింది. ఎదుటివాళ్ల వీక్‌నెస్‌ మీద ఆడటం గేమర్‌ లక్షణం కాదు.  నువ్వు గేమర్‌ కాదు, వేస్ట్‌.. ఓటమి తట్టుకోలేక ఏడ్చావు. గేమ్‌ ఇంట్రస్టింగ్‌గా ఆడటం మా బిగ్‌బాస్‌ చూసుకుంటాడు. నువ్వేం చేయనవసరం లేదు. సరే పోనీ, కూరగాయలు కట్‌ చేశాక ఆ తొక్క అంతా డస్ట్‌బిన్‌లో వేయడానికి అంత గొడవ అవసరమా? నీ ఆట బొచ్చులో ఆట అయిపోయింది. కోపమొస్తే కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నావని క్లాస్‌ పీకాడు నాగ్‌. నువ్వు గెలవడాని కంటే అవతలివాళ్ల వీక్‌నెస్‌ మీద దెబ్బ కొట్టాలని చూశావని ఫైర్‌ అయ్యాడు.

సంచాలక్‌గా తప్పు చేసిన గీతూ బిగ్‌బాస్‌ చెప్పేవరకు బాత్రూమ్స్‌ క్లీన్‌ చేయాలని పనిష్మెంట్‌ ఇచ్చాడు. ఎవరి ఆట వాళ్లు బాగా ఆడితే సీజన్‌ ఎక్కడుండాలో అక్కడుటుంది అన్నాడు. ఆట ఆడుతూనే అమ్మాయిల డ్రెస్‌ సరిదిద్దావంటూ బాలాదిత్యను మెచ్చుకున్నాడు నాగ్‌. శ్రీహాన్‌-శ్రీసత్య కలిసి ఆడారా? మిగతా జంటల సాయం తీసుకున్నారా? అని అడగ్గా వారు కలిసే ఆడామని తలూపారు. నాగ్‌ మాత్రం.. గీతూ దయాదాక్షిణ్యాల మీద మీ గేమ్‌ ఆధారపడిందని సెటైర్‌ వేశాడు.

సూర్య.. తనను ముగ్గురమ్మాయిల(ఇనయ, ఫైమా, కీర్తి) కన్నా నేను ఫిజికల్‌గా తక్కువ అనేసరికి బాధపడ్డానంది వాసంతి. ఫెమినిస్ట్‌ అయి ఉండి అలా మాట్లాడతావా? అని విమర్శించడంతో ముఖం మాడ్చాడు సూర్య. కామెడీ విషయంలో కొన్నిసార్లు నోరుజారుతున్నావు, జాగ్రత్తగా ఉండని ఫైమాను హెచ్చరించాడు నాగ్‌. గేమ్‌లో రేవంత్‌ మిగతావారిని నెట్టేసిన వీడియో చూపించిన నాగ్‌.. ఉన్మాదిలా ఆడుతున్నావు, ఆ కోపం తగ్గించుకుంటూనే గేమ్‌ ఆడు అని సలహా ఇచ్చాడు. ఈ వారం అనర్హులు బ్యాడ్జ్‌ ఎవరికి ఇస్తావంటే కెప్టెన్‌ శ్రీహాన్‌.. కీర్తి పేరు సూచించాడు. పాజిటివ్‌ తీసుకున్నంత ఈజీగా నెగెటివ్‌ తీసుకోలేదంటూ ఆమెకు అనర్హురాలు బ్యాడ్జ్‌ తగిలించాడు.

తర్వాత డైరెక్ట్‌ ఎలిమినేషన్‌ అంటూ సూర్య ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. ఊహించని ఎలిమినేషన్‌తో ఇనయ వెక్కి వెక్కి ఏడ్చింది. అతడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ భారంగా వీడ్కోలు పలికింది. ఫైమా, కీర్తి సైతం సూర్య వెళ్లిపోతుంటే కంటనీరు పెట్టుకున్నారు. మిగతా హౌస్‌మేట్స్‌ అతడిని సీక్రెట్‌ రూమ్‌కి పంపిస్తారేమోనని అభిప్రాయపడ్డారు. మరి సూర్య స్టేజీపైన ఏం మాట్లాడాడు? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ కోసం వేచి చూడాల్సిందే!

చదవండి: గీతూను ఓ ఆటాడుకుంటున్న నెటిజన్లు
నన్ను చితక్కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు: అనుపమ్‌ ఖేర్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు