Bigg Boss 6 Telugu: డ్యాన్సర్‌గా మారిన ఆదిరెడ్డి, చివరి రౌండ్‌లో ఆ ఇద్దరు!

11 Dec, 2022 18:31 IST|Sakshi

బిగ్‌బాస్‌ షోలో ఈ వారం ఇనయ ఎలిమినేట్‌ కానుంది అన్న విషయాన్ని ఆమె అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. లేడీ సింగాన్ని బయటకు పంపించేయడమేంటని బిగ్‌బాస్‌పై ఫైర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్‌ ప్రోమో రిలీజైంది. ఇందులో నాగ్‌ హౌస్‌మేట్స్‌తో ఓ ఫన్‌ గేమ్‌ ఆడించాడు. ఒకరు డ్యాన్స్‌ స్టెప్‌ వేస్తే అది ఏ పాటో మిగతావాళ్లు గెస్‌ చేయాల్సి ఉంటుంది.

అలా పాటలు, డ్యాన్సులతో హౌస్‌మేట్స్‌ ఫుల్‌ జోష్‌లోకి వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అయితే నేను డ్యాన్సర్‌ అంటూ అందరికంటే ఓ స్టెప్పు ఎక్కువే వేశాడు. తర్వాత అందరినీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివరికి ఆదిరెడ్డి, ఇనయ మిగిలారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది బోర్డుపై చూపిస్తానడంతో ప్రోమో ముగిసింది. ఎలాగో ఆది సేవ్‌ అవగా ఇనయ ఎలిమినేట్‌ అయిందని అందరికీ తెలిసిపోవడంతో ఈ ఎలిమినేషన్‌ ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా జరిగిపోయింది.

చదవండి: అది రేవంత్‌ను చూసే నేర్చుకున్నా: నాగార్జున

మరిన్ని వార్తలు