Bigg Boss 6 Telugu: ఆఖరి పోరాటంలో గెలిచిన శ్రీసత్య, రోహిత్‌.. ఉడుక్కున్న రేవంత్‌

15 Dec, 2022 23:44 IST|Sakshi

Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్‌. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్‌ అప్పీల్‌ టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్‌ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్‌లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్‌, శ్రీహాన్‌, శ్రీసత్య ఛాలెంజ్‌ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్‌ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్‌. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్‌ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్‌ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది.

మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్‌. రేవంత్‌ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్‌ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్‌ ఏంటి? నా క్యారెక్టర్‌ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్‌ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్‌ 6 టైటిల్‌ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్‌ ముగించాడు.

తర్వాత ఎగ్స్‌ షాట్‌ అనే ఛాలెంజ్‌లో రేవంత్‌, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్‌ పాల్గొనగా రేవంత్‌, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్‌ చేయమన్నాడు బిగ్‌బాస్‌. దీంతో శ్రీహాన్‌, కీర్తి, రోహిత్‌.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్‌ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్‌ స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని అతడికి ఈ ఓట్‌ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్‌ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్‌రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్‌ చేయలేదని రేవంత్‌ ఒకింత హర్టయ్యాడు.

ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్‌ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్‌ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్‌ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్‌ మీడియాలో శ్రీసత్య మిడ్‌ వీక్‌ ఎలిమినేట్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది.

చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్‌కు బలి
ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్‌

మరిన్ని వార్తలు