Bigg Boss Telugu 7 Latest Promo: శివాజీ తిక్క కుదిర్చిన కంటెస్టెంట్లు, నామినేషన్స్‌లో ఎవరెవరంటే?

2 Oct, 2023 13:47 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో చిత్రవిచిత్రమైనవి జరుగుతున్నాయి. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు. వీకెండ్‌లో కింగ్‌ ఆడించే గేమ్స్‌ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్‌ ఇస్తున్నారు. టాస్కులు అరకొరగానే సాగుతున్నాయి. ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్‌ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్‌ రాథోడ్‌, షకీల, దామిని, రతికా రోజ్‌.. ఇలా వరుసగా నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చారు.

ఇక శివాజీ చేస్తున్న అతికిగానూ తనకిచ్చిన పవరాస్త్రను తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే! దీంతో నేటి నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్‌ అతడిపై విరుచుకుపడ్డారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ కృష్ణ.. ఓ టాస్క్‌లో తేజ తనను బెల్ట్‌తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు. ఆ టాస్క్‌లో తేజ అలా చేస్తుంటే ఆపలేకపోయారంటూ శివాజీని నామినేట్‌ చేశాడు.

సందీప్‌ కంటెస్టెంట్‌గా ఉండుంటే తనకే నామినేట్‌ చేసేవాడినని, కానీ తను హౌస్‌మేట్‌ అయినందున తనను నామినేట్‌ చేసే ఛాన్స్‌ లేదన్నాడు. ప్రియాంక.. శివాజీ, యావర్‌ను నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం సందీప్‌, శోభా శెట్టి, ప్రశాంత్‌ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

మరిన్ని వార్తలు