Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీలోకి ఆ హీరోయిన్‌.. 17 మంది కంటెస్టెంట్స్‌ వీరే!

22 Feb, 2022 17:08 IST|Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలోనే కాకుండా.. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్‌ రియాల్టీ షో ప్రాసారమవుతుంది. ఆయా ప్రాంతాల్లోని ఫేమస్‌  పర్సన్స్‌ని కంటెస్టెంట్లు తీసుకొని షో నిర్వహించడం వల్లే ‘బిగ్‌బాస్‌’ ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇక తెలుగులో ఐదు సీజన్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కానుంది.ఇప్పటికే కంటెస్టెంట్స్‌ ఎంపిక పూర్తయింది. అంతేకాదు వారందరిని క్యారంటైన్‌కి కూడా తరలించారట.

ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ వీరే అంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వారిలో ఓ హీరోయిన్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.తెలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవి.. ఓటీటీ తొలి సీజన్‌లో పాల్గొనబోతుందట. ఇటీవల బిగ్‌బాస్‌ ఓటీటీ టీమ్‌ సోషల్‌ మీడియాలో ముఖం సరిగా కనిపించని ఓ ఫోటోని షేర్‌ చేస్తూ.. ఈ హీరోయిన్‌ ఎవరో కనిపెట్టండి నెటిజన్స్‌కు క్విజ్‌ పెట్టారు. ఆ ఫోటో పక్కా బిందు మాధవిదే అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె బిగ్‌బాస్‌ ఓటీటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. బిగ్‌బాస్‌ షో ద్వారా అయినా మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయని మాధవి భావిస్తోందట. 

ఇక మాధవితో పాటు ఈ షోలో కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1 కంటెస్టెంట్), ఆదర్శ్ (సీజన్ 1 రన్నర్), ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెంట్), రోల్‌ రైడా (సీజన్ 2 కంటెస్టెంట్), తేజస్వి (సీజన్ 2 కంటెస్టెంట్),అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్), అరియానా గ్లోరి (సీజన్ 4 కంటెస్టెంట్),మహేశ్‌ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్), సరయు (సీజన్ 5 కంటెస్టెంట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్) నటరాజ్ మాస్టర్ (సీజన్ 5 కంటెస్టెంట్),యూట్యూబర్, యాంకర్ నిఖిల్ ,యాంకర్ స్రవంతి చొక్కారపు,ఆర్జే చైతు, యాంకర్ శివ , చిచ్చా చార్లెస్‌, అజయ్‌ కతుర్వార్‌, రోల్‌ రైడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు అఫియల్‌ లిస్ట్‌లో ఉంటారో తెలియాలంటే.. ఫిబ్రవరి 26వరకు ఆగాల్సిందే.

మరిన్ని వార్తలు