వినోదాల బిగ్‌బాస్‌ 4

17 Aug, 2020 01:33 IST|Sakshi

‘‘వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్‌ ఫిక్షన్‌ షో బిగ్‌బాస్‌.. లె లుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్‌ సాధించిన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ అతి త్వరలో ప్రారంభం కానుంది’’ అని స్టార్‌ మా ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్‌ గతంలో కంటే ఈసారి మరింత ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యారు. బిగ్‌బాస్‌ 3వ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో నాగార్జున 4వ సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

వరుసగా రెండోసారి బిగ్‌బాస్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాట్లాడుతూ– ‘‘బిగ్‌బాస్‌ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌కి రావడం చాలా సరదాగా అనిపించింది. గత సీజన్‌ గొప్ప విజయం అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదంతో పాటు సర్‌ప్రైజ్‌లు కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నాం’’ అన్నారు. కాగా యంగ్, మిడిల్, ఓల్డ్‌ గెటప్స్‌లో నాగార్జున కనిపించిన 4వ సీజన్‌ ప్రోమోకి మంచి స్పందన లభించింది.

మరిన్ని వార్తలు