Bigg Boss 5 Telugu: సిరి సేఫ్‌ గేమ్‌ ఆడుతోంది, వెరీ బ్యాడ్‌: షణ్ముఖ్‌

23 Sep, 2021 00:06 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 18: యాంకర్‌ రవి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడయ్యే అవకాశాన్ని కల్పిస్తూ బిగ్‌బాస్‌ ఒక సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ప్రియ నెక్లెస్‌ దొంగిలించాలని చెప్పాడు. ఈ టాస్క్‌ను చాలా సునాయాసంగా పూర్తి చేశాడు రవి. ఈ విషయం తెలియక ప్రియ తన నగల డబ్బా కనిపించడం లేదంటూ ఇల్లంతా వెతికింది. ఇదిలా వుంటే సిరి, షణ్ముఖ్‌లు కుమ్మక్కై వచ్చారని, ఒకరి గేమ్‌ మరొకరు ఆడుతున్నారని ఇదివరకే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు ఉమాదేవి, సరయు ఆరోపించిన సంగతి తెలిసిందే! సన్నీ.. సిరి షర్ట్‌లో చేయి పెట్టాడంటూ ఆమెకు సపోర్ట్‌ చేసి చివరకు అది తప్పని తేలడంతో అందరి ముందు తలొంచాల్సిన పరిస్థితి వచ్చింది.

సిరి నుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేశా
వరుసగా జరుగుతున్న పరిణామాలతో షణ్నూ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. 'నాకు ఎక్కడో కొడుతుంది.. వరుస ఘటనలు చూస్తే మన సపోర్ట్ ఇన్ డైరెక్ట్‌గా సిరికి వెళ్లిపోతుంది.. అందుకే బెడ్ మారిపోదాం అనుకుంటున్నా. ఆమెను దూరం పెట్టడమే బెటర్ అనిపిస్తుంది.. ఎందుకో ఆమె సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది. అది నాకు నచ్చడం లేదు. వెరీ బ్యాడ్.. నేను సిరి నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేశా. కానీ ఆమె నుంచి కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయడం నాదే తప్పు’ అంటూ షణ్ముఖ్‌ ఆమె బెడ్డు పక్కన నుంచి వేరే చోటుకు షిఫ్ట్‌ అవ్వాలని అనుకుంటున్నానని జెస్సీతో చెప్పాడు.

ఇల్లు గుర్తొచ్చి ఏడ్చేసిన లోబో
'హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్‌లో ప్రియకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీ భర్త స్టాక్‌ మార్కెట్‌లో పెట్టిన డబ్బులన్నీ పోయాయి. మీ ఆస్తంతా ఆవిరైపోయింది అని బ్యాడ్‌ న్యూస్‌ వచ్చింది. దీంతో ఉన్నచోటే కూలబడిపోయింది ప్రియ. మరోపక్క టాస్కులో భాగంగా షణ్ముఖ్‌, లోబో శ్వేతతో పులిహోర కలిపారు. ఈ క్రమంలో శ్వేత లోబోతో క్లోజ్‌గా ఉండటం చూసిన షణ్ను.. ఏదైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది అని జోక్‌ చేశాడు. కానీ ఆ మాటను ఈజీగా తీసుకోలేకపోయిన శ్వేత.. అది ఫన్‌ కాదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన లోబో.. నన్ను నానామాటలు అంటున్నారు, లైట్‌ తీసుకుంటున్నా కదా! ఇది చాలా చిన్న విషయం, దీనికి అంత ఫీలవడం ఎందుకు? అని అసహనానికి లోనయ్యాడు. కాసేపటికే ఇంట్లోవాళ్లు గుర్తొస్తున్నారంటూ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు.

దండలు మార్చుకున్న శ్రీరామ్‌, లహరి
అనంతరం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులో కంటెస్టెంట్లు అంతా కలిసి లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేశారు. వాళ్లిద్దరూ ఒకరికొకరు రింగులు తొడిగించుకుని దండలు మార్చుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా డ్యాన్సులు కూడా చేయడంతో టాస్క్‌ ముగిసినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. ఇక రాత్రిపూట విశ్వ, హమీదా కాసేపు కబుర్లాడారు. పింకీ తనకు వీక్‌గా అనిపిస్తుందని హమీదా అంది. ప్రియ లేకపోతే ఆమె ఆడలేదేమో అనిపిస్తుందని చెప్పింది. శ్రీరామ్‌, జెస్సీ అటూఇటూ మాట్లాడతాడని అనిపిస్తారని, అబ్బాయిలలో రవి అందరినీ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తాడని హమీదా అభిప్రాయపడింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు