లాస్య, నోయల్‌ మధ్య మాటల యుద్ధం..

28 Sep, 2020 17:36 IST|Sakshi

సండే ఫన్‌డే కావడంతో హౌజ్‌మెట్స్‌ అంతా ఖుషీఖుషీగా గడిపారు. నాగార్జున ఇచ్చిన టాస్కులు పూర్తి చేసి ఆటపాటలతో సరదాగా గడిపారు. అయితే బిగ్‌బాస్‌లో ఆదివారం ఒకరూ ఎలిమినేషన్‌ కావాల్సి ఉండటంతో ఈ సారి ఎవరూ ఊహించని విధంగా దేవి నాగవల్లి బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి వెనుదిరిగారు. ఎప్పుడూ లేనిది ఇంటి సభ్యులంతా దేవి కోసం కంటతడి పెట్టుకున్నారు. దీంతో సోమవారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మునెపెన్నడూ లేని విధంగా ఈవారం నామినషన్‌ సరికొత్తగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల్లో ఎవరి ఇద్దరి మధ్య కూడా పెద్ద రచ్చ జరగలేదు. కానీ ప్రస్తుతం లాస్య, నోయల్‌ మధ్య పెను తుఫాన్‌లా మాటల యుద్దం జరిగేలా కన్పిస్తోంది. చదవండి : (బిగ్‌బాస్‌: నామినేషన్‌లో ఎవరూ మర్డర్‌‌ కానున్నారు?)

ఏదో విషయంపై పెరిగిన మాటల చర్చ చివరకు ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారి తీసినట్లు తెలుస్తోంది. నోయల్‌ గురించి లాస్య ఎవరితోనో రహస్యంగా మాట్లాడినట్లు నోయల్‌కు తెలియడంతో సరాసరి లాస్య వద్దకు వచ్చి నా గురించి ఏం మాట్లాడవ్‌ అంటూ తనను నిలదీశాడు. ‘నేను ఏం మాట్లాడలేదు. ముందు ఎవరూ మాట్లాడారో అడిగి తెలుసుకొని నిలదీయాలి’ అని సూటిగా చెప్పింది. దీంతో ఆవేశానికి వెళ్లిన నోయల్‌ ‘ఎందుకు అరుస్తున్నావ్‌.. నాకు అరవడం రాదనుకుంటున్నావా’ అంటూ లాస్యపై విరుచుకుపడ్డాడు. దీనిపై స్పందించిన లాస్య నీకే కాదు అరవడం నాకు కూడా వచ్చు. నీ వెనకాల మాట్లాడే అవసరం నాకు లేదు అని ఖరఖండిగా చెప్పేసింది. అయినప్పటికీ కూల్‌ అవ్వని నోయల్‌ నా ముందు మాట్లాడండి పిలుస్తాననగా.. ముందుకు తీసుకురా మాట్లాడుదాం అని లాస్య తేల్చి చెప్పేసింది. దీంతో లాస్య, నోయల్‌ మధ్య ఈ సంఘర్షణ సై అంటే సై అనేలా సాగబోతుంది. ఇదంతా చూస్తుంటే ఇకపై బిగ్‌బాస్‌ అంచనాలను మించి ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. (స్వాతి దీక్షిత్ గురించి లాస్య చెప్పింది నిజ‌మేనా?)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు