సుశాంత్‌ కేసు: రియా చక్రవర్తి జాడ తెలియలేదు

2 Aug, 2020 11:23 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బిహార్‌ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా శనివారం ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. పోలీసులు సుశాంత్‌ మృతికి సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. అదే విధంగా అతని స్నేహితులు, సహచరులు, బంధవులను విచారించి హత్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైలో ఉన్న సుశాంత్‌ సోదరి, మాజీ ప్రేయసి అంకితా లోఖండే, వంటమనిషి, పలువురు స్నేహితుల వద్ద వాంగ్మూలం  తీసుకున్నారని  తెలిపారు. కానీ రియా చక్రవర్తి ఎక్కడ ఉన్నారో ఇంకా గుర్తించలేదని, ఆమె ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదన్నారు.(సుశాంత్‌ కేసు: రియా పిటిషన్‌పై 5న విచారణ)

అదే విధంగా సుశాంత్‌ బ్యాక్‌ అకౌంట్‌, ట్రాన్జాక్షన్స్‌ సమాచారాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నారని డీజీపీ తెలిపారు. బిహార్‌ పోలీసులకు సుశాంత్‌ కేసును దర్యాప్తు చేసి చేధించే సామర్థ్యం ఉందన్నారు. సుశాంత్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు న్యాయం చేస్తారని తెలిపారు. ఈ కేసు విచార‌ణ‌ను బిహార్ నుంచి ముంబై పోలీసుల‌కు అప్ప‌గించాల‌ని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విషయం తెలిసిందే. జూన్ 14న సుశాంత్  ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విచారణలో ప‌లు సంచ‌ల‌న‌ విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. సుశాంత్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్‌ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. (రియాకు వ్య‌తిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఒత్తిడి)

మరిన్ని వార్తలు