త్రిష ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్న వ్యక్తితో లవ్‌.. బిందు మాధవి ఏమందంటే?

6 May, 2023 17:51 IST|Sakshi

ఆవకాయ్‌ బిర్యానీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బిందుమాధవి. తర్వాత తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆమె బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఓటీటీ షో ద్వారా మరోసారి అభిమానులను అలరించింది. ఈ రియాలిటీ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ మే 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ క్రమంలో శనివారం న్యూసెన్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిందుమాధవికి యాంకర్‌ సూటిప్రశ్న విసిరింది. త్రిష ప్రియుడిని ప్రేమించారా? అని ముఖం మీదే అడిగేసింది. దీనికామె క్షణంపాటు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంది. ఆ వెంటనే స్పందిస్తూ.. అందులో కొంత నిజం, కొంత అబద్ధం ఉందని చెప్పింది. త్రిష ప్రియుడిని ప్రేమించిన మాట వాస్తవమే కానీ ఒకేసారి తామిద్దరం ప్రేమించలేదని స్పష్టం చేసింది. త్రిష అతడికి మాజీ ప్రేయసి అయ్యాకే తాము ప్రేమలో పడ్డామంది. అయితే వీరి బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఇద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు.

కాగా కొన్నేళ్లక్రితం త్రిష వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్‌ మణియన్‌ను ప్రేమించింది. వీరిద్దరూ ఘనంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్‌మెంట్‌ అయిన కొద్ది రోజులకే వీరిద్దరూ పెళ్లి రద్దు చేసుకుని విడిపోయారు. ఇది జరిగిన కొంతకాలానికి వరుణ్‌ మణియన్‌ బిందుమాధవితో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరిగింది. కొన్ని నెలలు సీరియస్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరు ఫారిన్‌ టూర్లకు, పార్టీలకు కలిసి వెళ్లేవారు. ఈ క్రమంలో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే వీరి ప్రేమ కూడా పెళ్లి వరకు రాకుండానే ఆగిపోయింది.

చదవండి: సింగర్‌తో ఛత్రపతి హీరోయిన్‌ డేటింగ్‌, నటి ఏమందంటే?

మరిన్ని వార్తలు