రజనీకాంత్‌కు కారునే గిఫ్ట్‌గా ఎందుకు ఇచ్చారు.. కారణం ఇదేనా?

24 Sep, 2023 12:30 IST|Sakshi

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్కు, కారుతో సత్కరించారు చిత్ర నిర్మాత కళానిధి మారన్‌. అలాగే దర్శకుడు నెల్సన్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు కూడా ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. జైలర్ సక్సెస్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీ కూడా కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చాను. ఇప్పుడిప్పుడే ధనవంతుడయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు)

సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ స్పీచ్‌పై కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా క్రిటిక్‌ బిస్మీ ఇలా స్పందించాడు. రజనీకాంత్‌ ప్రసంగం ఒక కోణంలో సరైనదేనని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కళానిధి మారన్‌కు మరో కోణంలో ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగించి ఉంటాయని బిస్మి చెప్పాడు. రజనీ సూపర్‌స్టార్‌ అయినప్పటికీ చాలా ఏళ్లుగా అంబాసిడర్‌ కారునే వాడేవారు. పదేళ్ల క్రితం వరకు ఆయన అంబాసిడర్‌ కారునే వాడేవాడని ఆయన తెలిపాడు తర్వాత ఆయన ఇన్నోవా కారుకు మారారని తెలిపాడు.

రజనీ తర్వాత వచ్చిన నటీనటులంతా విలాసవంతమైన కార్లలో వస్తుంటే, రజనీ మాత్రం సినిమా షూట్‌లకు వెళ్లి తిరిగి వచ్చేది సాధారణమైన కారులోనే అని ఆయన తెలిపాడు. రజనీ కాంత్‌ అప్పట్లో తలచుకుని ఉండుంటే ఎన్నో లగ్జరీ కార్లను కొని ఉండవచ్చు. కానీ అతను  సింపుల్‌గానే ఉండాలని ఎందుకు అనుకున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న.. ఎన్నో ఏళ్లుగా అంబాసిడర్‌ కారు వాడుతున్న రజనీ ఈ మధ్యే ఇన్నోవా కారుకు మారాడని గుర్తుచేశాడు. అందువల్లే కళానిధి మారన్‌ ఇచ్చిన గిఫ్ట్‌ను ధనవంతుల కారుగా ఆయన చెప్పి ఉండవచ్చు అని పేర్కొన్నాడు.

(ఇదీ చదవండి: హోటల్‌ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!)

ఒక విజయవంతమైన నటుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. లెక్కలేనన్ని కోట్లు సంపాదించాడు. ఎంతో ధనవంతుడైన రజనీ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చెప్పడం కష్టం అనే రేంజ్‌కు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతలా లేదని కోలీవుడ్‌లో టాక్‌. ఇప్పటికే రజనీకాంత్‌తో పాటు ఆయన  భార్యపై పలు చెక్‌ బౌన్స్‌ కేసులు ఉన్నాయని కోలీవుడ్‌ ఇండస్ట్రీలో వినికిడి. 

జూదగాడు ఓడిపోయాడు
ఇదిలా ఉంటే, రజనీ విలాసవంతమైన కార్లు నడపలేదు కానీ జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అని బిస్మీ చెప్పాడు. సినిమాకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడి ఇక్కడ సంపాదించిన డబ్బంతా రజనీ పోగొట్టుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించడం కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బంతా అక్కడ పోగొట్టుకుని ప్రస్తుత  జీవితాన్ని రజనీ గడుపుతున్నాడని తెలిపాడు. అలాంటప్పుడు నేడు కళానిధి మారన్‌ ఇచ్చిన లగ్జరీ కారు ఆయనకు ఇప్పటి పరిస్థితిల్లో గొప్పగానే ఉంటుందని తెలిపాడు.

ప్రస్తుతం రజనీ వద్ద ఎలాంటి లగ్జరీ కారు లేనందునే కళానిధి మారన్‌ ఈ కానుకను ఇచ్చాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్‌ గురించి బిస్మీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. లాస్‌ వెగాస్‌లో ఆయన జూదం ఆడుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట ఉన్నాయి. అప్పట్లో ప్రధాన నేషనల్‌ మీడియా ఛానల్స్‌ కూడా ఇదే విషయంపై పలు కథనాలను కూడా ప్రచురించింది. 

మరిన్ని వార్తలు