ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి

15 Nov, 2020 08:36 IST|Sakshi

శ్రీహరి కోటలో బిత్తిరి సత్తి

ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగించారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు  మేఘాంశ్‌ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్‌ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు.    

► ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్‌టైనర్స్‌ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్‌ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను.

► నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్‌ లోకి రానివ్వను. నా ఫస్ట్‌ మూవీ ‘రాజ్‌దూత్‌’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను.  

► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు.

► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి?

ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాల కోసం ఈ వీడియో చూసేయండి మరి...

మరిన్ని వార్తలు