ట్వీట్ రచ్చ.. రామ్‌గోపాల్‌ వర్మపై ఫిర్యాదు

28 Jun, 2022 15:55 IST|Sakshi

కొరాపుట్‌(భువనేశ్వర్‌): వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై నబరంగ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా బీజేపీ మహిళా విభాగం సభ్యులు సోమవారం ఫిర్యాదు చేశారు. భారత రాష్ట్రపతి పదవికి ఎన్డీయే కూటిమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముపై రామ్‌గోపాల్‌ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తక్షణమే వర్మను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

దేశ అత్యున్నత పదవికి పోటీ చేస్తున్న ఒడియా గిరిజన మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు అత్యంత నేర పూరితమైనవిగా అభివర్ణించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా వర్మకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం నాయకురాలు, కౌన్సిలర్‌ షర్మిష్టా దేవ్, సునీతా పాఢీ, మినతి పట్నాయక్, గౌరీ శంకర్‌ మజ్జి, దేవదాస్‌ మహంకుడో, నిల్లు మిశ్ర, మానస్‌ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Pooja Hegde: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు

మరిన్ని వార్తలు