ఆదిపురుష్‌కు మరోషాక్‌, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే

6 Oct, 2022 17:00 IST|Sakshi

రోజురోజుకు ఆదిపురుష్‌ వివాదం ముదురుతోంది. ప్రభాస్‌ లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ఆదిపురుష్‌ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్‌ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్‌ వక్రికరించారంటూ హిందు సంఘాలు, బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

తాజాగా మరో బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ ఆదిపురుష్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వమంటూ ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్‌ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వం. తమ చౌక ప్రచారం కోసం మరోసారి మా దేవుళ్లు, దేవతలను ఈ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’ అని ఆయన అన్నారు. ‘ఎప్పటిలాగే క్షమాపణలు చెప్పడం, సదరు సీన్లను కత్తిరించడం చేస్తే సరిపోదని, మరోసారి ఇలాంటి ఆలోచన చేయకుండా వారికి గుణపాఠం చెప్పాలన్నారు.

చదవండి: గాడ్‌ఫాదర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే

ఇటువంటి తప్పులు పునరావుతం కాకుండా సినిమాలపై పూర్తిగా నిషేధం విధించాలని అని ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు. కాగా మైథలాజికల్‌ చిత్రంగా రామాయణం ఇతీహాసం నేపథ్యంలో ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలోని రావణుడు, హనుమంతుడి పాత్రలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రామాయణలో చూపించి విధంగా వారిని చూపించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గ్రాఫీక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈచిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌ అసలు బాగాలేవని, ఓ యానిమేటెడ్‌ చిత్రం చూస్తున్నట్టుగా ఉందంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు