పోలింగ్‌ బూత్‌లోకి శృతి.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

7 Apr, 2021 13:19 IST|Sakshi

నిన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌లో హీరోయిన్‌ శృతి హాసన్‌ చేసిన పొరపాటు ఆమెను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. మంగళవారం తమిళనాడుతో పాటు కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసస్‌లు కూడా తండ్రి కమల్‌ హాసన్‌తో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే కమల్‌ హాసన్‌ ఈ ఎన్నికల్లో కోమంబత్తూర్‌ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒటు వేసిన అనంతరం కమల్‌ ఆయన పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ దక్షిణ నియోజకవర్గంలోని పోలీంగ్‌ బూతులోకి వెళ్లాడు. అయితే ఆయనతో పాటు శృతి హాసన్‌ కూడా లోపలికి వెళ్లింది. ఈ సంఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రవర్తించిన శృతి తీరుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శృతి హాసన్‌.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు.

పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ అంతకన్న కాదు. మరెందుకు పోలీంగ్‌ బూతులోకి అనమతించారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇ​క ఎన్నికలు జరుగుతున్న పోలింగ్‌ బూతులోకి ఆమెను ఎలా అనుమతించారంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. అంతేగాక శృతి పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే ​కాకుండ.. ట్విట్టర్‌లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యంకు(ఎమ్‌ఎన్‌ఎమ్‌) ఓటు వేయమని చెప్పడం కూడా కమిషన్‌ నిబంధనలకు విరుద్దమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్‌ కూడా శృతిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటికి దీనిపై‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ స్పందించడం కానీ చేయలేదు. మరి ఎన్నికల కమిషన్‌ శృతిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

చదవండి: 
పిట్టకథలు ట్రైలర్‌: ఎంతమంది మొగుళ్లే నీకు.. 

మరిన్ని వార్తలు