హాలీవుడ్‌ హీరో చద్విక్‌ బోస్‌మ్యాన్‌ మృతి

30 Aug, 2020 05:31 IST|Sakshi
చద్విక్‌ బోస్‌మ్యాన్‌

మార్వెల్‌ సూపర్‌ హీరో బ్లాక్‌ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్‌ బోస్‌మ్యాన్‌ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్‌తో బా«దపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. చద్విక్‌  వయసు కేవలం 43 సంవత్సరాలే. 2016లో ఆయనకు క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడింది. క్యాన్సర్‌ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్‌ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో నటించారాయన. 2003లో నటుడిగా చద్విక్‌ తన కెరీర్‌ను ప్రారంభించారు. 2013లో వచ్చిన ‘42’లో ఆయన చేసిన జాకీ రాబిన్‌సన్‌ పాత్ర పెద్ద బ్రేక్‌. ఆ తర్వాత ‘ది కిల్‌ హోల్, డ్రాఫ్ట్‌ డే, గెట్‌ ఆన్‌ అప్, గాడ్స్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌’ వంటి సినిమాలు చేశారు. చద్విక్‌ మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు