వివాదంలో బిగ్‌బీ బంగ్లా, కూల్చేయాలని బీఎంసీ ఆదేశం

5 Jul, 2021 14:02 IST|Sakshi

ముంబైలోని బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌-జయ బచ్చన్‌ దంపతుల బంగ్లా ప్రతీక్ష చూడటానికి ఇంద్రభవంలా ఉంటుంది. అటూగా వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రతీక్ష నుంచి చూపు తిప్పుకోలేరు. చెప్పాలంటే వారి బంగ్లా టూరిస్టు ప్లేస్‌ను తలిపించేలా ఉంటుంది. ప్రతి రోజు వందల మంది అభిమానులు ప్రతీక్ష దగ్గర క్యూ కడుతుంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్‌బీ బంగ్లా ప్రతీక్ష వివాదంలో చిక్కుకుంది. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ నేత తులిప్‌ బ్రియాన్‌ మిరండా డిమాండ్‌ చేశారు.

అంతేగాక 2017లో రోడ్డు విస్తిర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్‌ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్‌(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసిందని, ఇప్పుడు ఆ నోటీసులపై వెంటనే చర్యలు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ నేత మిరండా బీఎంసీని కోరారు. కాగా ముంబై అమితాబ్‌ మొదటగా నిర్మించుకున్న బంగ్లా పేరు ప్రతీక్ష. దీని తర్వాత ఆయన జాల్సా అనే మరోక బంగ్లాను కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రతీక్ష రోడ్డు విస్తిరణలో భాగమై ఉందని వెంటనే దానిని బీఎంసీ స్వాధీనం చేసుకుని కుల్చివేయాలంటూ మిరండా వ్యాఖ్యానించారు. తులిప్‌ బ్రియాన్‌ మిరండా శనివారం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఆయన.. ‘అమితాబ్‌ బచ్చన్‌కు 2017లోనే ప్రతీక్ష అక్రమ నిర్మాణంలో ఉందంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చింది. వీటిని రోడ్డు విస్తిర్ణంలో భాగంగా జారీ చేసింది. అయితే బీఎంసీ ఇప్పటి వరకు ఉదాసీనంగానే వ్యవహరించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. అదే ఓ సామాన్యుడికి చెందిన భూమి అయి ఉంటే బీఎంసీ ఇప్పటికే దానిని స్వాధీనం చేసుకుని ఉండేది. మున్సిపల్‌ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు’ అని ఆయన ప్రశ్నించారు. అయితే అమితాబ్‌ మరికొందరూ తమ బంగ్లాలకు సంబంధించిన మెయిన్‌ మ్యాప్‌లలో మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కాగా కాంగ్రెస్‌ నేత మిరండా ఆరోపణల మేరకు బీఎంసీ కౌన్సిలర్‌ స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఆయన బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు