అవకాశాలు లేక తాగుడుకు బానిసై..

28 Jan, 2021 06:40 IST|Sakshi

బాలీవుడ్‌లో నెపొటిజమ్‌ వల్ల ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేని వారు నష్టపోతున్న వార్తలు ఒకవైపు వింటున్నాం. మరోవైపు అన్ని వెన్నుదన్నులు ఉన్నా ఒక్క వేషం దొరక్క తెర మరుగైపోయే స్టార్‌ కిడ్స్‌ కథలు కూడా ఉన్నాయి. బాబీ డియోల్‌ పుట్టినరోజు నిన్న (జనవరి 27). కాని ఐదేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా తాగుడుకు అలవాటు పడితే భార్య ఇంటినుంచి అతణ్ణి బయటకు పంపేసిన కథ ఇవాళ బయటకు వచ్చింది. ధర్మేంద్ర రెండో కొడుకు బాబీ డియోల్‌. పెద్ద కొడుకు సన్ని డియోల్‌ను లాంచ్‌ చేసిన ధర్మేంద్రనే బాబీ డియోల్‌ను కూడా ‘బర్సాత్‌’ సినిమాతో ఇంట్రడ్యూస్‌ చేశాడు. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత బాబీ ‘గుప్త్‌’ సినిమాతో హిట్‌ కొట్టాడు. కొన్నాళ్లు కెరీర్‌ బాగానే సాగింది కాని 2012 నాటి అతడికి ఒక్క సినిమా కూడా దొరకలేదు.

ఫ్లాపుల హీరోగా పేరు పడి ఇంట్లో ఉండిపోయాడు. ‘ఎందరిని అడిగినా ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు’ అని బాబీ డియోల్‌ చెప్పుకున్నాడు. దాంతో తాగుడులోకి వెళ్లిపోయాడు బాబీ. అతని భార్య తాన్యా డియోల్‌ ఒక దశలో విసిగిపోయి ఇంటినుంచి వెళ్లగొట్టేంత పని చేసింది. అయితే ఆమె సపోర్ట్‌తో మెల్లగా అతను డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాడు. సల్మాన్‌ఖాన్‌ అతనికి ‘రేస్‌ 3’లో అవకాశం ఇచ్చాడు. అది ఆడకపోయినా బాబీకి పేరు వచ్చింది. ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన ‘ఆశ్రమ్‌’లో బాబీ డియోల్‌ విశేషమైన ప్రతిభ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక మీదట అతడి కెరీర్‌ సజావుగా సాగుతుందని కోరుకుందాం.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు