సింధూర..

17 Oct, 2020 00:49 IST|Sakshi
హన్సిక, ‘జయం’ రవి

‘జయం’ రవి, అరవింద్‌ స్వామి హీరోలుగా, హన్సిక హీరోయిన్‌గా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బోగన్‌’. లక్ష్మణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘సింధూర..’ పాటను శుక్రవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా తెలుగు ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడం మా టీమ్‌కి సంతోషంగా అనిపించింది. తమిళ సెన్సేషన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ డి. ఇమ్మాన్‌ ట్యూన్‌ చేసిన ‘సింధూర..’ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్‌ ఆలపించారు. భువనచంద్రగారు ఈ పాటకు లిరిక్స్‌ అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా