Amitabh Bachchan: ప్రతి రోజు 100 ఉత్తరాలు రాసేవారు.. తండ్రిని తలచుకొని అమితాబ్‌ ఎమోషనల్‌

14 Sep, 2022 12:29 IST|Sakshi

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన తండ్రి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్‍పై ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అప్పట్లో మా నాన్న అభిమానులకు స్వయంగా లేఖలు రాసేవారని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా తానే స్వయంగా పోస్ట్ చేసేవారని తెలిపారు. పోస్ట్‌మెన్లను తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ గౌరవించేవారని వివరించారు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోలో పోస్టల్ ఉద్యోగి జ్యోతిర్మయితో మాట్లాడే సందర్భంలో అమితాబ్ తన తండ్రి రాసిన లేఖలను గుర్తు చేసుకుని  ఎమోషనల్ అయ్యారు.ఇటీవల కౌన్‌ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఒక పోటీదారుడు.. హరివంశ్ రాయ్ బచ్చన్ రాసినా కొన్ని లేఖలు తమ వద్ద ఉన్నాయని అమితాబ్‌తో చెప్పగా.. వాటిని తనకు అందజేయమని అమితాబ్ బచ్చన్‌ కోరారు. 

(చదవండి: వారి వల్లే మెంటల్లీ బరువు తగ్గిపోయింది: నాగార్జున)

అనంతరం తండ్రి గురించి మాట్లాడుతూ..‘మా నాన్న తన అభిమానులకు, స్నేహితులకు చాలా ఉత్తరాలు రాస్తుండేవారు. ప్రతిరోజు 50 నుంచి 100 ఉత్తరాలు రాసేవాడు, ప్రతి ఒక్కరి ఉత్తరానికి తనంతట తానుగా సమాధానం చెప్పేవాడు. చిన్న చిన్న పోస్ట్‌కార్డ్‌లపై రాసి, వాటిని  తానే స్వయంగా పోస్ట్‌లో ఇచ్చేవాడు. మళ్లీ పోస్టాఫీస్‌కి ఎందుకు వెళ్తున్నావని నేను ఆయనను అడిగితే, 'కార్డు పంపించాడో లేదో చూడబోతున్నాను" అని సమాధానం చెప్పేవారని అమితాబ్ వివరించారు. 

“ప్రేక్షకులలో ఎవరైనా మా నాన్నగారు స్వయంగా వ్రాసిన ఉత్తరం ఉందని తనతో చెప్పాలని కోరుకుంటున్నట్లు అమితాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారి నుంచి ఉత్తరాలు సేకరించి.. వాటిని ప్రేక్షకుల నుంచి తీసుకునే ముందు మరో కాపీని వారికి కచ్చితంగా ఇస్తానన్నారు.  నూ కూడా 'పోస్ట్‌మెన్‌లను చాలా గౌరవిస్తానని' అమితాబ్ అన్నారు. “మా యుగంలో పోస్ట్‌మ్యాన్ మా హీరో.. ఎందుకంటే అతను మాత్రమే మా కమ్యూనికేషన్‌కు మూలంగా ఉండేవారు. మా ఇళ్లకు ఉత్తరాలు తెచ్చేవారని అందుకే మేము వారిని చాలా గౌరవిస్తామని అమితాబ్ తెలిపారు. 

మరిన్ని వార్తలు