సరికొత్త కథతో టాలీవుడ్‌ రీఎంట్రీ ఇస్తున్న అర్బాజ్ ఖాన్!

3 Feb, 2024 16:35 IST|Sakshi

'జై చిరంజీవ' చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు అర్బాజ్ ఖాన్. ఆ తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్‌ చిత్రంలో నటించబోతున్నాడు ఈ పాపులర్‌ బాలీవుడ్‌ నటుడు. యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అర్బాజ్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక డిఫరెంట్‌ కథలో మళ్లీ టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని అర్బాజ్‌ ఖాన్‌ అన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ''అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. అర్బాజ్ గారి పాత్ర అద్భుతంగా అంటుంది. ఈ రోజు నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'అని అన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు