అర్జున్‌ రాంపాల్‌కు ఎన్‌సీబీ నోటీసులు

9 Nov, 2020 16:09 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌కు నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎస్‌సీబీ) అధికారులు నోటీసులు అందజేశారు. బాలీవుడ్‌కి డ్రగ్స్‌కి లింక్‌ ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని రాంపాల్‌కు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు ఎన్‌సీబీ అధికారులు అర్జున్‌ రాంపాల్‌ నివాసంపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు.

కాగా, ఆదివారం  ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను అరెస్టు చేసి.. ఆ ఇంటినుంచి 10 గ్రాముల మార్జువానాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తమముందు ఈ నెల 8 న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫిరోజ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.  బాలీవుడ్ కి చెందిన మరికొందరి ఇళ్లలో తాము  సోదాలు చేయనున్నామని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు