Sharukh Khan New Look: బాలీవుడ్ బాద్‌ షా కొత్త లుక్.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా!

25 Sep, 2022 21:28 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఇందులో జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో కనిపించునున్నారు. ఈ సినిమాలో షారుక్ కొత్త లుక్‌ తెగ వైరలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ హైప్‌ని క్రియేట్‌ చేసింది. తాజాగా షారుక్‌ కొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. కింగ్‌ఖాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్టర్‌ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

షారుక్‌ న్యూ లుక్‌.. షాక్‌లో ఫ్యాన్స్‌!
షారుక్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. తాను కూడా పఠాన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫోటోలో షారూఖ్ పొడవాటి జుట్టుతో మంచం మీద కూర్చుని కేవలం జీన్స్ మాత్రమే ధరించి కనిపించారు. ఆ ఫోటోలో షేర్ చేసిన వెంటనే అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ఖాన్ చివరిసారిగా 2018లో ‘జీరో’ సినిమాలో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా టీజర్‌ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ముంబయి, స్పెయిన్‌, దుబాయ్‌లోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్  తర్వాత దీపిక పదుకొణేతో నాల్గవసారి కలిసి నటిస్తున్నారు.

A post shared by Shah Rukh Khan (@iamsrk)

మరిన్ని వార్తలు