Swara Bhaskar: ఆమెతో చులకనగా ప్రవర్తించవద్దు..స్వరా భాస్కర్‌ ఘాటు రిప్లై

12 Nov, 2021 11:48 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతారు బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌. తాజాగా తాను పెట్టిన పోస్టుకు నెటిజన్‌ ఓ కామెంట్‌  చేశాడు. దానికి స్వరా ఘాటు రిప్లై ఇచ్చింది. స్వరా భాస్కర్‌ ఈ మధ్యే ఓ మైక్రో బ్లాగింగ్‌ను మొదలుపెట్టారు. అందులో చీరతో దిగిన సెల‍్ఫీని పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా 'ఒక చీర, ఒక పార్క్‌, ఒక నడక, ఒక పుస్తకం.. ప్రశాంతంగా.. ఇలా కచ్చితంగా ఫీల్‌ అవ్వాలి.' అని రాసుకొచ‍్చారు. 

ఈ పోస్ట్‌కు 'చీరలో మీకంటే నా పనిమనిషి చాలా అందంగా, గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది' అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ఆ కామెంట్‌కు స్వరా 'మీ పనిమనిషి సహాయం నిజంగా అందమైనది. ఆమెను, ఆమె శ్రమను మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఆమెతో చులకనగా ప్రవర్తించవద్దు.' అని ఘాటుగా సమాధానమిచ్చింది. అలాగే గత నెలలో ఒక యూట్యూబ్‌ ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌ తనపై ట్విటర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు