Virat Kohli: కోహ్లీ హోటల్ రూమ్ వీడియో.. బాలీవుడ్ నటుల ఫైర్

31 Oct, 2022 19:20 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లికి హోటల్‌ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్‌ కోహ్లీ హోటల్‌ రూమ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్‌లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

(చదవండి: విరాట్‌ హోటల్‌ రూమ్‌ వీడియో లీక్‌పై అనుష్క తీవ్ర ఆగ్రహం)

ఈ ఘటనపై కింగ్‌ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్,  అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్  ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్‌ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు