సల్మాన్‌, సంజయ్‌తో సహా జైలు కూడు తిన్న బాలీవుడ్‌ సెలబ్రిటీలు వీళ్లే

20 Oct, 2021 20:08 IST|Sakshi

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తనయుదు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆర్యన్‌ ముంబైలోరి ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైల్లో ఖైదు అయిన వారిలో ఆర్య‌న్ ఏమీ ఫ‌స్ట్ సెల‌బ్రిటీ కాదు..అత‌ని కంటే ముందు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు జైలుకెళ్లారు. కొంత మంది బెయిల్‌పై విడుదలైయితే...మరికొంత మంది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంతకీ జైల్లో చిప్పకూడు తిన్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే..

సల్మాన్‌ ఖాన్‌

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ ఐదేళ్ల శిక్ష విధించింది.  ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు., మొద‌ట ఆయ‌న్ను ఉంచింది ఆర్థ‌ర్ రోడ్ జైలులోనే.

సంజయ్‌ దత్‌
1993 ముంబై సీరియ‌ల్ బాంబు పేలుళ్ల కేసులో సంబంధం ఉంద‌నే అభియోగంపై బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించాడు. మొదట్లో అతన్ని ర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచి, ఆ త‌ర్వాత పూణేలోని యెర‌వాడ జైలుకు త‌ర‌లించారు.

ఫర్దీన్ ఖాన్‌
ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ 2001లో ముంబై పోలీసులకు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఫర్దీన్ ఖాన్ కేసు కోర్టుకు కూడా వెళ్లింది. ఆయన కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్సకు అంగీకరించడంతో ఎలాంటి శిక్షా పడలేదు.

సొనాలి బింద్రే
ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ వివాదంలో ఒక మతాన్ని కించపరిచిన కారణంగా జైలు కెళ్లిన సోనాలి బింద్రే. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయింది

రియా చక్రవర్తి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతనికి డ్రగ్స్ సరఫరా చేసిన పలువురు డ్రగ్ పెడ్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో, సుశాంత్ అప్పటి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షావిక్ చక్రవర్తి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు చిక్కుకున్న తర్వాత రియా చక్రవర్తిని సెప్టెంబర్ 7 న ఎన్‌సిబి విచారించింది. ఒక నెల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నటి బెయిల్‌పై విడుదలైంది.

షైనీ అహుజా
పనిమనిషిని అత్యాచారం చేసిన కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన శైనీ ఆహూజా.  2009 జూన్‌లో అరెస్ట్ అయిన గ్యాంగ్‌స్ట‌ర్ హీరో షైనీ అహుజాకు  2011 లో బాంబే హైకోర్టు  బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు ఆయన ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఖైదీగా కాలం గ‌డిపాడు.

రాజ్‌కుంద్రా
ఇటీవ‌ల అశ్లీల చిత్రాల నిర్మాణం, ముంబైల్ యాప్స్‌లో వారి ప‌బ్లిష్ చేశార‌నే అభియోగం కింద శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, బెయిల్ మంజూర‌య్యేంత వ‌ర‌కు రెండు నెల‌ల పాటు ఆర్థ‌ర్ రోడ్ జైలులో ఉంచారు. 

మరిన్ని వార్తలు