ఈ సీఈఓ నవ్విస్తూ.. అలరిస్తుంది

28 Mar, 2021 09:54 IST|Sakshi

సాధారణంగా సీఈఓను చూస్తే, భయం, బెరుకు కలుగుతాయి. కానీ, ఈ సీఈఓను చూస్తే అవేమీ ఉండవు. ఎందుకంటే, ‘సీఈఓగిరి’ వెబ్‌సిరీస్‌లో ఈశా మిమ్మల్ని నవ్వుతూ.. నవ్విస్తూ.. అలరిస్తుంది. 

ఢిల్లీలో పుట్టి పెరిగింది. న్యూయార్క్‌లో కమ్యూనికేషన్‌ డిజైన్‌ కోర్సు చేసి, మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే డిష్‌ టీవీ, మైక్రోమ్యాక్స్, టాటా డొకోమో, ఫరెవర్‌ మార్క్, డీబీర్స్‌ వంటి పెద్ద పెద్ద వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 

► ప్రకటనల్లో తను కనబర్చిన నటన.. తనకే తృప్తి నివ్వలేదు. దీంతో, లీ స్ట్రాస్‌బర్గ్‌ మెథడ్‌ యాక్టింగ్‌ టెక్నిక్‌లో శిక్షణ తీసుకుంది. లండన్‌లోని ఫిల్మ్‌ అకాడమీ కాలేజీలో స్క్రీన్‌ రైటింగ్, ఫిల్మ్‌ మేకింగ్, యాక్టింగ్‌లో డిప్లొమా కోర్సులు చేసింది. యాక్టింగ్‌ కెరీర్‌ కోసం ముంబై చేరింది. 

► తన సర్టిఫికెట్స్, ఫొటోస్‌ పట్టుకుని వెంటనే అవకాశాల కోసం వెళ్లలేదు. మొదట యూట్యూబ్‌లో వీడియోస్‌ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత పలు షార్ట్‌ మూవీస్‌లో నటించింది. వాటిలో ‘పాప్‌కార్న్‌’, ‘పర్‌ఛాయి’ షార్ట్‌ మూవీస్‌ ఆమెకు మంచి పేరు తేవడంతో పాటు, బాలీవుడ్‌ మూవీ అవకాశాన్నీ ఇచ్చాయి. అలా 2016లో సోనమ్‌ కపూర్‌ స్నేహితురాలిగా ‘నీరజ’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా మూడు పెద్ద సినిమాల్లో నటించింది. 

► కేవలం నటిగానే కాదు, రచయిత్రిగా కూడా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె మాటలు రాసిన  ‘క్లీన్‌ సెవెన్‌’ సినిమా న్యూయార్క్‌ ‘ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2016’లో ప్రదర్శించారు. ‘పీ.ఓ.డబ్ల్యూ– బందీ యుద్‌ కే’ అనే వెబ్‌ సిరీస్‌కు కూడా మాటలు రాసింది. ప్రస్తుతం ‘బేవఫా సే వఫా’, ‘సీఈఓ గిరి’, ‘వాట్‌ ద ఫ్లోక్స్‌’ వెబ్‌ సిరీస్‌ల్లో అందరినీ అలరిస్తోంది.  

► ఫ్యాషన్‌పై ఉన్న ఇష్టంతో మోడల్‌ లేదా  డిజైనర్‌ కావాలనుకున్నాను. కానీ, యాడ్‌ షూట్‌ సమయంలో నా నటన కారణంగా ఆలస్యం జరిగేది. అందుకే, ముందు మంచి నటిగా మారాలని నిర్ణయించుకున్నా.
– ఈశా చోప్రా

మరిన్ని వార్తలు