ఆ విషయాలేవీ గుర్తులేవు: కంగన

7 Dec, 2020 20:07 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్ తన చిన్ననాటి ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‌'చిన్నతనంలో తోటి పిల్లలతో ఆడుకున్నట్లు పెద్దగా గుర్తులేదు, కానీ తన బొమ్మల కోసం మాత్రం రకరాకాల ఫ్యాన్సీ  దుస్తులు కుట్టేదాన్ని. దీని కోసం  గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించినా ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. దీనివల్లేనేమో ఏదైనా విషయాల్లో లోతుగా ఆలోచించేంత పరిపక్వత అలవడింది. అయితే దురదృష్టవశాత్తూ మనలో కొందరు పుట్టుకతోనే వృద్ధులుగా (అలాంటి మనస్తత్వం)తో జన్మిస్తారు..వారిలో నేను కూడా ఉన్నాను' అని కంగనా పేర్కొంది. (సింగర్‌పై ఫైర్‌ బ్రాండ్‌ ఘాటు వ్యాఖ్యలు)

కాగా చిన్నతనం నుంచే తనకు ఫ్యాషన్‌పై రకరకాల ప్రయోగాలు చేసేదానినని, తనకున్న నాలెడ్జ్‌ ప్రకారం వివిధ రకాలైన దుస్తులు, వాటికి ఎత్తు చెప్పులు వేసుకుంటే అవి చూసి చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేస్తూ నవ్వేవారంటూ కంగనా గతంలో పేర్కొంది. అక్కడి పరిస్థితుల నుంచి నేడు లండన్‌ ఫ్యాషన్‌  వీక్‌లో పాల్గొన్న తీరు వరకు ఎంతో గర్వంగా అనిపిస్తుంటుందని తెలిపింది.  ఇక కంగన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న 'తలైవి' మూవీకి సంబంధించి  కొన్నివర్కింగ్‌ స్టిల్స్‌ను కంగనా ఇటీవలె తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. అరవింద్‌ స్వామి, ప్రకాష్‌ రాజ్‌, భాగ్య శ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు. (వివాదాస్పద ట్వీట్‌.. కంగనకు నోటీసులు)
 

మరిన్ని వార్తలు