Khushi Kapoor Kollywood Entry: అక్క టాలీవుడ్.. చెల్లి కోలీవుడ్‌.. ఎంట్రీ అదిరిపోయిందిగా?

15 Sep, 2023 21:32 IST|Sakshi

బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాలతో కెరీర్‌లో బిజీగా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా ఆమె చెల్లెలు ఖుషి కపూర్‌ సైతం దక్షిణాదిలో ఎంట్రీకి సిద్ధమైంది. శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు  టాక్ వినిపిస్తోంది. ఓ యువ హీరోకు జంటగా ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం కానుందని వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: రూమ్‌లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు.. కానీ: సీనియర్ నటి)

ది అర్చీస్‌ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేశారు ఖుషి కపూర్‌. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మ్యూజికల్‌ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే ఖుషి కపూర్‌ త్వరలోనే కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారంటూ నెట్టింట వైరలవుతోంది. అధర్వ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి విఘ్నేశ్‌ శివన్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆకాశ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నట్లు తెలుస్తోంది. మంచి ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

(ఇది చదవండి: 'ఏంటి సార్ కొత్త ఫోనా'.. ఆసక్తి పెంచుతోన్న బిగ్ బాస్ ప్రోమో!)

మరిన్ని వార్తలు