స్టార్ హీరోయిన్‌ నగ్న ఫోటోషూట్ .. సోషల్ మీడియాలో వైరల్!

23 Apr, 2023 15:16 IST|Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు  సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్‌ చేసిన ఈ కొత్తజంట ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే  గతంలో కియారా చేసిన ఓ ఫోటో షూట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్రముఖ ఫోటో గ్రాఫర్‌ డబూ రత్నానీ తీసిన ఫోటోను తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గతంలో 2021 క్యాలెండర్‌ కోసం ఈ ఫోటోకు ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే కియారా డబ్బు కోసం టాప్‌లెస్‌గా కనిపించలేదని ఫోటోగ్రాఫర్ రత్నానీ తెలిపారు. కియారా చిత్రాన్ని ముంబైలోని ఒక హోటల్‌లో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. నేను గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇలాంటి ఫోటో షూట్‌ తీశానని తెలిపారు. 2020లో కియారా చేసిన ఫోటోషూట్ కూడా వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గతంలో కృతి సనన్, దీపికా పదుకొనే, విద్యాబాలన్, సన్నీ లియోన్, పరిణీతి చోప్రా, టబు క్యాలెండర్‌ కోసం టాప్‌లెస్‌గా పోజులిచ్చారు.

A post shared by Dabboo Ratnani (@dabbooratnani)

మరిన్ని వార్తలు