Vidya Sinha: స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన ప్రముఖ నటి

15 Aug, 2022 15:55 IST|Sakshi

Vidya Sinha Passed Away On Independence Day: విద్యా సిన్హా.. బాలీవుడ్‌లో పాపులారిటీ దక్కించుకున్న సీనియర్‌ నటీమణుల్లో ఒకరు. 'రజనీగంధ', 'పతి పత్నీ ఔర్‌ వో' వంటి తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నవంబర్‌ 15, 1947 రోజున పుట్టిన ఆమె ఆగస్టు 15, 2019లో మరణించారు. నేటితో ఆమె మరణించి మూడేళ్లు పూర్తయింది. దేశానికి స్వాతంత్యం వచ్చిన సంవత్సరంలో జన్మించిన  విద్యా సిన్హా, భారత్‌కు ఇండిపెండెన్స్‌ వచ్చిన రోజునే కన్నుమూశారు. ఇది యాధృచ్చికమో, దేశ స్వాతంత్య్రానికి ఆమెకున్న తెలియని అనుబంధమో చెప్పడం కష్టమే ! 

కాగా 71 ఏళ్ల వయసులో విద్యా సిన్హా ముంబైలోని జుహూ ఆస్పత్రిలో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె హాస్పిటల్‌లో చేరారు. మొదటగా ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచారు. అయితే తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఆమె మరణించారు. ఇక ఆమె సినీ కెరీర్‌ విషయానికొస్తే.. 18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది విద్యా సిన్హా. అనంతరం 'రజనీగంధ', 'చోటీ సీ బాత్‌', 'పతి పత్నీ ఔర్‌ వో' సినిమాలతో పాపులారిటీ దక్కించుకుంది. 

చదవండి: బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

తర్వాత కొంత విరాం తీసుకున్న విద్యా సిన్హా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ 'బాడీగార్డ్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 2006లో వచ్చిన 'కావ్యాంజలి' వంటి పలు టీవీ షోలలో ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌తో కలిసి పనిచేసింది.  అయితే పెళ్లి తర్వాతే విద్యా సిన్హా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం విశేషం. 1968లో వెంకటేశ్వరన్‌ అయ్యర్‌ను వివాహమాడిన విద్యా సిన్హా.. జాన్వీ అనే కుమార్తెను దత్తత తీసుకుంది. 1996లో భర్త మరణించిన తర్వాత, 2001లో నేతాజీ భీమ్‌రావ్‌ సాలుంఖేని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా 2009లో విడాకులు అయ్యాయి.

చదవండి: నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్‌.. కన్నీరు పెట్టుకున్న నటి

మరిన్ని వార్తలు