షూటింగ్స్‌ బంద్‌

15 Apr, 2021 03:49 IST|Sakshi

ఇప్పటికే కరోనా కోరల్లో చిక్కుకుని పలువురు హిందీ స్టార్స్‌ క్వారంటైన్‌ లో టైమ్‌ గడుపుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇటీవలే థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది. దీంతో రిలీజ్‌కు దగ్గరైన సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా సినిమా, టీవీ షూటింగ్స్‌ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘బ్రేక్‌ ది చైన్‌ ’ పేరుతో ఏప్రిల్‌ 14 సాయంత్రం నుంచి మే 1 ఉదయం  వరకు లాక్‌డౌన్‌  విధించించి, కొత్త మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది.

దీంతో కోవిడ్‌ జాగ్రత్తల నడుమ జరుగుతున్న కొద్ది సినిమాల షూటింగ్స్‌ కూడా నిలిచిపోనున్నాయి. షారుక్‌ ఖాన్‌  ‘పఠాన్‌ ’, సల్మాన్‌ ఖాన్‌  ‘టైగర్‌ 3’, అమితాబ్‌బచ్చన్‌  – రష్మికల ‘గుడ్‌ బై’ , కార్తీక్‌ ఆర్యన్‌  ‘భూల్‌ భులయ్యా 2’ చిత్రాలతో పాటు  ముంబయ్‌లో జరుగుతున్న ఇతర సినిమాల షూటింగ్స్‌కి కూడా బ్రేక్‌ పడింది. ‘‘మేం అన్ని రూల్స్‌ పాటిస్తున్నాం. అయినా షూటింగ్స్‌ కారణంగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని అనుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని కలిసి షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటాం’’ అని ఫెడరేషన్‌  ఆఫ్‌ వెస్ట్రన్‌  ఇండియా సినీ ఎంప్లాయీస్‌ అధ్యక్షుడు బీఎన్‌  తివారీ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు