అతడి ఇంటికి 12 సార్లు గంజాయి సప్లై

27 Sep, 2020 15:04 IST|Sakshi
ప్రసాద్‌

ముంబై : సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ క్షితిజ్‌ రవి ప్రసాద్‌ను ఆదివారం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు ఎన్‌సీబీ అధికారులు. ఈ సందర్భంగా మరో తొమ్మిది రోజులు.. అక్టోబర్‌ 5వ తేదీ వరకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. షోవిక్‌, రియా చక్రవర్తికి గంజాయి‌ సప్లయ్‌ చేసిన వారితో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో శనివారం ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. శుక్రవారం ప్రసాద్‌ ఇంట్లో జరిపిన సోదాలలో వాడిపడేసిన గంజాయి లభించినట్లు వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ( డ్రగ్స్‌ కేసు: రకుల్‌, దీపిక, శ్రద్ధా ఫోన్లు‌ సీజ్‌ )

కాగా, డ్రగ్‌ డీలర్‌ సంకేత్‌ పాటెల్‌ విచారణలో ప్రసాద్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ప్రసాద్‌ ఇంటికి గంజాయి సప్లయి చేసినట్లు విచారణ సందర్భంగా పాటెల్‌ తెలిపాడు. మే నుంచి జులై వరకు దాదాపు 12 సార్లు ప్రసాద్‌ ఇంటికి గంజాయి పంపినట్లు, గంజాయి పంపిన ప్రతిసారి 3,500 రూపాయల డబ్బు ముట్టజెప్పినట్లు వెల్లడించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు