God Father: ‘గాడ్‌ ఫాదర్‌’లో రామ్‌ చరణ్‌.. సల్మాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే?

2 Oct, 2022 21:23 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం గాడ్‌ ఫాదర్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ నటించారని బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. ఇటీవల ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. 

 సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ 'ఈ మూవీలో రామ్‌ చరణ్‌ అతిథి పాత్ర పోషించారు. తెరపై చూసేందుకు తామూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఒకే ఫ్రేమ్‌లో కలిసి నటించాలని ఉందని రామ్‌ చరణ్‌ చెప్పారు. అతను జోక్‌ చేస్తున్నాడేమో అనుకుని, దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పా. మరుసటి రోజే చరణ్‌ తన క్యాస్ట్యూమ్స్‌ తీసుకుని సెట్‌కి వచ్చేశాడు' అని అన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఆచార్య’లో చిరు, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు.  ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. 


 

మరిన్ని వార్తలు