ఆలియాభట్‌ స్టార్టప్.. పిల్లల దుస్తులు‌

30 Dec, 2020 10:35 IST|Sakshi

వెండితెరపై రకరకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆలియాభట్‌ ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌ పాత్రలోకి ప్రవేశించింది. అయితే ఇది ‘రీల్‌’ జీవిత పాత్ర కాదు ‘రియల్‌’ జీవిత పాత్ర. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లల దుస్తుల కోసం ‘ఎడ్‌–ఎ–మమ్మా’ అనే స్టార్టప్‌ లాంచ్‌ చేసింది. మన  ప్రధాని నినాదం ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’తో గొంతు కలిపింది.

ఆలియా క్లాతింగ్‌ లైన్‌ను ఎందుకు ఎంచుకుంది అనే విషయాన్ని పక్కనపెడితే ఈ స్టార్టప్‌ ప్రత్యేకత నేచురల్‌ ఫ్యాబ్రిక్స్‌. ప్లాస్టిక్‌తో తయారైన బటన్స్‌ ఉపయోగించకపోవడం ఇందులో ఒకటి. ‘ఎడ్‌–ఎ–మమ్మా’ ద్వారా ‘బ్యాక్‌ టు నేచర్‌’ నినాదానికి బలం చేకూర్చాలనే సంకల్పబలం ఆలియాలో కనిపిస్తుంది. స్టోర్‌ల సంఖ్య పెంచడంతో పాటు పిల్లల పుస్తకాల ద్వారా స్టోరీలు కూడా చెబుతుందట.

పిల్లలను ప్రకృతికి మరింత దగ్గరికి తీసుకువెళ్లే కథలన్నమాట!  ‘ప్రతి గార్మెంట్‌ ఒక కథ చెబుతుంది. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతుంది’ అంటున్న ఆలియా నుంచి వచ్చిన మరో మంచి మాట: ‘చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. భూమాతకు అందరం బిడ్డలమే. చిన్నపిల్లలమే!’

మరిన్ని వార్తలు