క్షేమం కోరి...

6 Nov, 2020 05:53 IST|Sakshi

బాలీవుడ్‌లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్‌’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్‌ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్‌ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్‌ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్‌ యు నిక్‌’ అంటూ లాస్‌ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్‌ అగర్వాల్‌–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్‌ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్‌ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్‌ చేశారు.

రానా, మిహీకా; ∙నక్‌తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్‌; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా

మరిన్ని వార్తలు