నేనూ బాలీవుడ్‌కి ఇచ్చాను!

17 Oct, 2020 06:13 IST|Sakshi

ఒకటి ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ పాత్ర.. మరొకటి గూఢచారి పాత్ర. రెండూ సీరియస్‌ పాత్రలే. సీరియస్‌గా తీసుకుని చేయాల్సిన పాత్రలు. అందుకే కంగనా రనౌత్‌ చాలా సీరియస్‌గా శిక్షణ మొదలుపెట్టారు. ‘తేజస్‌’ అనే చిత్రంలో ఆమె ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గానూ ‘ధాకడ్‌’లో గూఢచారిగానూ చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల కోసమే శిక్షణ తీసుకుంటున్నారు. ‘‘వరుసగా రెండు యాక్షన్‌ చిత్రాలు చేయబోతున్నాను. ఆషామాషీ విషయం కాదు. అందుకే ట్రైనింగ్‌ తీసుకుంటున్నాను. బాలీవుడ్‌ నా ప్లేట్‌కి చాలా ఇచ్చింది. కానీ ‘మణికర్ణిక’ తర్వాత నేను కూడా బాలీవుడ్‌కి ఓ మంచి యాక్షన్‌ హీరోయిన్‌ని ఇచ్చాను (ఈ చిత్రంలో తను చేసిన  వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ పాత్రను ఉద్దేశించి)’’ అన్నారు కంగనా రనౌత్‌. కిక్‌ బాక్సింగ్, పిల్లిమొగ్గలు వేయడం.. ఇలా ట్రైనింగ్‌లో భాగంగా చాలా నేర్చుకుంటున్నారు కంగనా.

శిక్షణ తీసుకుంటున్న కంగనా

మరిన్ని వార్తలు