ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నసీరుద్దీన్ షా

30 Jun, 2021 14:07 IST|Sakshi

న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరిన నసీరుద్దీన్ షా

శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి దిలీప్‌ కుమార్‌ 

ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్న వైద్యులు

సాక్షి, ముంబై: వరుస సంఘటనలు  బాలీవుడ్‌ వర్గాలను కలవర పరుస్తున్నాయి. ప్రముఖ నటి మందిరా బేడీ భర్త హఠాన్మరణం బాలీవుడ్‌ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, మరో ప్రముఖ యాక్టర్‌ నసీరుద్దీన్ షా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం మరింత ఆందోళనకు గురి చేసింది. జూన్‌ 11న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత, దిలీప్ కుమార్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.

దిలీప్ కుమార్‌ (98)కు మరోసారి శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను ఆసుపత్రికి తరలించామన్నారు. దిలీప్‌ కుమార్‌ ఆరోగ్యంపైఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

మరోవైపు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా (70) కూడా బుధవారం ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియాతో బాధపడుతున్న షా ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు షా బాగానే స్పందిస్తున్నారని షా మేనేజర్ ధృవీకరించారు. అటు నసీరుద్దీన్ షా భార్య, కుమారుడు వివాన్ సహా కుటుంబమంతా  దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

గత రెండురోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనను జూన్ 29వ తేదీన హాస్పిటల్‌లో చేర్పించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుందన్నారు.త్వరలో డిశ్చార్జ్  అవుతారని భావిస్తున్నామని నసీరుద్దీన్ షా  భార్య, నటి రత్నా పథక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఊపిరితిత్తుల్లో ప్యాచ్‌ కారణంగా ఆసుప్రతిలో చేర్పించాల్సి వచ్చిందన్నారు. కాగా  మందిరా బేడీభర్త రాజ్‌ కౌశల్‌  గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

చదవండి :  ప్రముఖ నటి మందిరా బేడి భర్త కన్నుమూత
Gold Price: గుడ్‌న్యూస్‌,ఈ ఒక్క నెలలోనే ఎంత తగ్గిందో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు