అమీర్‌ ఖాన్‌ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు..

15 Mar, 2021 19:02 IST|Sakshi

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్ ఖాన్ అభిమానుల‌కు షాకిచ్చాడు. సోష‌ల్‌మీడియా నుంచి అతను వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేయడంతో అభిమానులతో పాటు యావత్‌ సినీ ప్రపంచం కుదుపునకు లోనైంది. అమీర్‌ తన ఆఖరి ట్వీట్‌లో.. "త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు(మార్చి 14) తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, తనపై ఇన్నేళు ప్రేమాభిమానాల‌ను చూపించిన వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను, సోషల్‌ మీడియా వేదికగా ఇదే నా చివరి పోస్ట్‌, సోష‌ల్ మీడియా నుంచి తాను త‌ప్పుకుంటున్నానంటూ" పేర్కొన్నాడు. అయితే ఈ స్టార్ హీరోకు సంబంధించిన అప్‌డేట్స్‌ను స్వీయ నిర్మాణ సంస్థ అయిన అమీర్‌ఖాన్ ప్రొడ‌క్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏకేపీ) అందించ‌నున్నట్లు ఆయన తెలిపారు. ఏకేపీకి సంబంధించిన ట్విట‌ర్ ఖాతా వివారలను (@akppl_official) అతని ఆఖరి ట్వీట్‌లో పోస్ట్‌ చేశాడు.
 

మరిన్ని వార్తలు