స్టార్‌ హీరోలకు చుక్కలు చూపిస్తున్న ఆడియెన్స్‌

31 May, 2022 18:10 IST|Sakshi

బాలీవుడ్ లో వింత ట్రెండ్ కొనసాగుతోంది. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న స్టార్స్ నటించిన మూవీస్ కు మినియం కలెక్షన్స్ ఉండటం లేదు.లేడీ సూపర్ స్టార్ కంగనా నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ధాకడ్ ఇటీవలే అక్కడ రిలీజైంది. సుమారు 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈ మూవీ పట్టుమని 3 కోట్లు రాబట్టుకులేకపోయింది.అన్నిటికంటే కంగనాకు పెద్ద అవమానం ఏంటంటే సినిమా రిలీజైన 8వ రోజున కేవలం 20 టికెట్లు అమ్ముడుపోవడం ఆమె జీర్ణించుకోలేకపోతోంది.

జెర్సీ విషయంలో షాహిద్ కపూర్,జాయేష్ భాయ్ జోర్దార్ తో రణవీర్ సింగ్, ధాకడ్ తో కంగనా ఆడియెన్స్ నుంచి అవుట్ రైట్ రిజెక్షన్ ఎదుర్కొన్నారు. బాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అనేక్ కూడా బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు మార్క్ దాటేందుకు అష్టకష్టాలు పడుతోంది.

థియేటర్స్ కు వచ్చిన సినిమాల సంగతి ఇలా ఉంటే థియేటర్ కు వచ్చేందుకు రెడీ అవుతున్న మరికొన్ని సినిమాలను ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ లో రిలీజ్ అవుతోంది.  2018లో తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ కావడంతో కొంత సమయం తీసుకుని ఆమిర్ ఈ చిత్రంతో తిరిగొస్తున్నాడు. హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ అఫీసియల్ రీమేక్ లాల్ సింగ్ చెద్దా. తెలుగు నటుడు నాగ చైతన్య ముఖ్యపాత్రలో పోషించాడు.

ప్రమోషన్స్ లో భాగం యూనిట్ ఇటీవలే ఐపీఎల్ ఫైనల్లో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ పై కూడా బాలీవుడ్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. మూవీలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ గతంలో వచ్చిన పీకే, ధూమ్ 3 చిత్రాల్లో కనిపించిన విధంగానే ఉందంటున్నారు నెటిజన్స్. అంతేకాదు ఈ మూవీ గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ దారిలోనే ఉందంటూ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు.

మరిన్ని వార్తలు